అన్వేషించండి

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు

Andhrapradesh News: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఆయన నివాసానికి ఆదివారం తెల్లవారుజామున వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు.

Ysrcp Mp Mithun Reddy House Arrest: తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (MP MithunReddy) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఎంపీ నివాసానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఆదివారం పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు మిథున్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే, గొడవలు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డిని పుంగనూరు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తాజాగా, ఛైర్మన్‌తో పాటు 13 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎంపీ భావించారు. అందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు కొత్త వారిని కూడా అనుమతించడం లేదని వాపోతున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా

అయితే, పోలీసుల తీరుపై ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ప్రజలను కూడా తనను కలవనీయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీగా మా కార్యకర్తలను పరామర్శించేందుకు నాకు అర్హత ఉన్నా.. అడ్డుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'పోలీసులు నన్ను ఎవరినీ కలవకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా. ఎన్నికల్లో 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. వారందరిపైనా దాడులు చేస్తారా.?. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాం. నేను నా కార్యకర్తలను కలిసేందుకు వీలు లేదని.. హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేయిస్తోంది.' అని ఆరోపించారు.

పుంగనూరులో టీడీపీ ఆందోళన

అటు, పుంగనూరు అంబేడ్కర్ సర్కిల్‌లో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఐదేళ్లు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు అన్నారు. గోబ్యాక్ పెద్దిరెడ్డి, గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు వారికి సద్ది చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో పోలీసులు పుంగనూరులో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు, పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు

Also Read: Amudalavalasa MLA Ravikumar : గన్ మెన్లు వద్దన్న కూన రవికుమార్ - మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget