Janasena Vs Ysrcp : బీజేపీతో సంసారం చంద్రబాబుతో శృంగారం - జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఘాటు విమర్శలు!
పవన్ కల్యాణ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు వైఎస్ఆర్‌సీపీ నేతలు. బీజేపీతో సంసారం చంద్రబాబుతో శృంగారం చేస్తున్నారని ప్రకటన విడుదల చేశారు.
Janasena Vs Ysrcp : పవన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు దూకుడు పెంచారు. పవన్ ది జనసేన కాదని, నారా ..నాదెండ్ల సేన అని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. పవన్ కు డీల్ కుదిరించి.. ప్యాకేజీ సెట్ అయిందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం...ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.అంతే కాదు...జనసేన కాదు.. అది "నారా-నాదెండ్ల" సేన అని పేర్కొన్నారు. రాజకీయం అంటే సొంత కళ్యాణం కాదు... లోక కళ్యాణం అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పవన్ కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ అని పేర్కొన్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్ కు మరో ఆఫీస్ ఎందుని ఎద్దేవా చేశారు. రాజకీయ కరువు బాధితుడు పవన్ కు స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు అందాయ్ అన్నారు.
వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం నుంది దాడిశెట్టి రాజా, సుధాకర్ బాబు, శంకర్ నారాయణ పేరుతో ప్రకటన విడుదలైంది. టీడీపీతో డీల్ ఓకే అయిపోయిందని గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడు ద్వారా స్పష్టమవుతోందని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. అది చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల పుట్టిన పార్టీ కాబట్టే, పవన్ కల్యాణ్ తనకు కులం లేదంటాడు, మతం లేదంటాడు, ప్రాంతం లేదంటాడు. అతనికి ఉన్నది చంద్రబాబుని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బాబు కోసం పోటీ చేస్తున్నావా లేక నీ కోసం నువ్వు పోటీ చేస్తున్నావా.. అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పలేదన్నారు.
175కు 175 ఎమ్మెల్యే సీట్లలో, 25కు 25 లోక్ సభ సీట్లలో నీ బీ-ఫామ్ మీద అభ్యర్థులను నిలబెడుతున్నావా లేదా అంటే, దానికీ సమాధానం లేదు. తనను కాక, మరో సినీ నటుడ్ని నిన్న అమిత్ షా కలవటంతోనే పవన్ కల్యాణ్ కు ఇక టీడీపీ వైపు వెళ్ళిపోవాలన్న ఆత్రం మరింత పెరిగినట్టు ఉందన్నారు. ఇక్కడ బీజేపీలో ఉన్నాడా లేదా అన్నది చెప్పకుండానే, సంసారం ఒకరితో... శృంగారం మరొకరితో అన్నట్టు బీజేపీ మిత్ర పార్టీగా చెబుతూనే ప్రతిరోజూ చంద్రబాబు డైలాగులనే వల్లె వేస్తున్నాడంటే... పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ కుదిరిందని తేల్చారు. పర్యటన కూడా బహుశా టీడీపీ కోసం, టీడీపీ చెప్పినట్టు, టీడీపీ చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ డైలాగులతో, స్క్రిప్టుతో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
మూడేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల డీబీటీ మూడేళ్ళలోనే జరిగిందని వైసీపీ నేతలు గుర్తు చేశఆరు. మరి ఈ డబ్బంతా బాబు-పవన్ ప్రభుత్వంలో ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రాయలసీమలో రెయిన్ గన్లు పట్టుకుని ఐదేళ్ళకు ఐదేళ్ళు కరువు ఉన్న రోజుల్లో రైతు కష్టం పవన్ కల్యాణ్ కు కనపడలేదు. ప్యాకేజీ ఒక్కటే కనిపించింది. పార్టనర్ షిప్ సమ్మిట్లు అని చొక్కా పైన వేసుకునే కోట్లు అద్దెకు తెచ్చి, దొంగ సంతకాలు పెట్టించి, పారిశ్రామిక అభివృద్ధి అన్న చంద్రబాబు రోజుల్లో, ప్రత్యేక హోదాను పోగొట్టిన పవన్ కల్యాణ్ మగతనం ప్యాకేజి కోసం పూర్తిగా చచ్చిపోయిందని మండిపడ్డారు. జనసేన పేరుతో ఇప్పుడున్నది నారా-నాదెండ్ల సేన అని గ్లాసు బాబుది.. డోస్ పవన్ కంటూ వ్యాఖ్యానించారు.