RK Roja: 'అవన్నీ డిలీట్ చేయండి' - మాజీ మంత్రి ఆర్కే రోజు స్ట్రాంగ్ వార్నింగ్
Andhra News: తన పేరిట ఉన్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, అకౌంట్లను వెంటనే డిలీట్ చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
RK Roja Warning To Youtube Channel Owners: మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా (RK Roja) తన పేరిట ఉన్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్‌పై మండిపడ్డారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని.. వెంటనే తన పేరుపై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్స్ డిలీట్ చేయాలని వాటిని క్రియేట్ చేసిన వారిని హెచ్చరించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. 'నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నా. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు గమనించగలరు. నాపై ఉద్దేశ పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నా.' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024
నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.
నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,
నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…