అన్వేషించండి

YSRCP attneds Assembly:  అసెంబ్లీకి హాజరు కావడానికి వైసీపీ నిర్ణయం.. అయితే ఓ ట్విస్ట్ ఉంది

 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించుకుంది. రేపు జరిగే వైఎస్సార్సీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతిపక్ష హోదాపై అసంపూర్ణతతో వైసీపీ అసెంబ్లీకి హాజరుకానుంది.
  • జగన్ హాజరుకాకున్నా, పెద్దిరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.
  • అనర్హత భయం, ఉపఎన్నికల ఖర్చుల దృష్ట్యా ఈ మార్పు జరిగింది.
  • శాసనసభ్యుడిగా పూర్తిస్థాయి గుర్తింపుకై ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారు.

YSRCP Assembly: ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ ఇక నుంచి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం జరిగే వైఎస్సార్సీపీ శాససనభాపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇందులో ఓ కీలకాంశం ఉంది. ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యయేలు దూరంగా ఉంటున్నారో.. ఆ పార్టీ అధినేత,శాసససభాపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరు కాబోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. 

పెద్దిరెడ్డి నేతృత్వంలో శాసనసభకి..

అయితే శాసనససభలో YSRCP పక్షానికి సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. శాసనసభపక్ష ఉపనేతగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.పార్టీలోని కొందరు ముఖ్యనేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సమావేశాలకు హాజరు కాకూడదనే నిర్ణయించారు. 

వైసీపీ నిర్ణయంలో మార్పు ఎందుకు?

మాజీ సీఎం జగన్ మోహనరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో వైకాపా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తోంది. పాలకపక్షానికి వ్యతిరేకంగా ఉన్న తమ పార్టీకి హోదా కల్పించడం సముచితం అని.. ప్రభుత్వం కావాలనే నిరాకరిస్తుండటంతో సమావేశాలకు హాజరుకాబోమని వైఎస్ జగన్ ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. ఆ మాట మీదనే ఉన్నామని ఈ మధ్యలో కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఈ నిర్ణయంలో మార్పునకు కారణమేంటని చూస్తే..  ఈ మధ్య కాలంలో స్పీకర్ చేసిన ప్రకటన కారణంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు అలవెన్సులు నిలిపివేయడంతో పాటు.. వారిని అనర్హులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొన్ని సందర్భాల్లో చెప్పారు.పైగా ఈ సమావేశాలకు ముందు డిజిటల్ అటెండెన్స్ తీసుకొస్తామని కూడా అన్నారు.దీంతో ఎమ్మెల్యేలలో అనర్హత భయం పట్టుకుంది. 

ఉపఎన్నికలకు వెళ్లడం అవసరమా..?
ప్రభుత్వ సంకేతాలు చూస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా వేసేలా కనిపించింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు అనర్హత భయం పట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం వాళ్లు చేయలేరు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు..గెలిచే అవకాశాలు కూడా తక్కువ. అందుకే అంతర్గతంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న ఓ వాదన తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ కూడా ఎమ్మెల్యేలతో  " పెద్దిరెడ్డన్న వస్తారు.. మీతో.. ఆయనతో అసెంబ్లీకి వెళ్లండి" అని చెప్పారు. 

అధ్యక్షా.. అనలేమా..! 

అనర్హత భయం ఒక్కటే కాదు.. ఇప్పుడు గెలిచిన వాళ్లలో కొంతమంది మొదటి సారి ఎమ్మెల్యేలున్నారు.వాళ్లు కనీసం అసెంబ్లీకి వెళ్లి "అధ్యక్షా..!" అనలేదు. పార్టీ అధినేతకు గౌరవం దక్కలేదని ఎమ్మెల్యేలకు అసెంబ్లీని దూరం చేయడం ఏంటన్న వాదన వస్తోంది. పైగా శాసనసభ్యుడు అనే హోదాకు పరిపూర్ణత వాళ్లు అసెంబ్లీకి వెళితేనే వస్తుంది. శాసనసభకు వెళ్లకుండా "శాసనసభ్యుడు"  అని ఎలా చెప్పుకుంటారని టీడీపీ విమర్శిస్తోంది.  పార్టీలోని బోత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్లు కూడా అసెంబ్లీకి వెళ్లడం సరైన నిర్ణయమని.. అసెంబ్లీకి వెళ్లకుండా సమస్యలపై పోరాటం ఎలా చేస్తామని జగన్‌కు నచ్చజెప్పారు. 

కారణాలేమైనా కానీ మొత్తానికి అసెంబ్లీకి వెళ్లడానికి వైసీపీ నిర్ణయించుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Ashirvada Deepam event 2026: ప్రధాని మోదీకి ఏపీలో ఆశీర్వాద దీపం - కేంద్ర ప్రాజెక్టుల్లో నేడు భారీ ఉత్సవం - హాజరుకానున్న కూటమి ప్రముఖులు!
ప్రధాని మోదీకి ఏపీలో ఆశీర్వాద దీపం - కేంద్ర ప్రాజెక్టుల్లో నేడు భారీ ఉత్సవం - హాజరుకానున్న కూటమి ప్రముఖులు!
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Embed widget