అన్వేషించండి

YS Jagan: 'ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి' - ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్ సంచలన ప్రకటన

Andhraprdesh News: ఏపీలో ప్రస్తుతం ఆటవిక పాలన సాగుతోందని.. దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.

YS Jagan Sensational Demand: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఈ నెల 24న పార్టీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు పెరిగాయని మండిపడ్డారు. 'రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దాడులపై ప్రధాని మోదీని కలుస్తాం. ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తోంది. 46 రోజుల పాలనలో 36 హత్యా రాజకీయాలు, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 300కు పైగా హత్యాయత్నాలు, 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు.' అంటూ జగన్ ధ్వజమెత్తారు.

'కిరాతకంగా చంపేశారు'

'వినుకొండలో రషీద్‌ను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నిందితుడు నరికాడు. కేవలం వైసీపీ కోసం పని చేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు. ఇది కక్షపూరితంగా జరిగిన హత్య అని చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పుంగనూరులో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. వినుకొండ ఎస్పీని ఎన్నికల వేళ పలుకుబడితో మార్చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనపై ఢిల్లీలో ధర్నా చేపడతాం. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరతాం. రాష్ట్రంలో పరిస్థితి వివరిస్తాం.' అని జగన్ పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

అంతకు ముందు వినుకొండలో బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రషీద్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రషీద్ హత్యపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య చేశారని చెబుతున్నారని.. కానీ రాజకీయ కక్షలతోనే హత్య చేశారని జగన్ దృష్టికి తెచ్చారు. రషీద్ హత్య వెనుక కుట్ర ఉందని.. ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో లేవన్నారు. 

జగన్ భద్రతపై..

మరోవైపు, వినుకొండ పర్యటన సందర్భంగా జగన్‌కు కేటాయించిన భద్రత వాహనాలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఆయన భద్రతపై నిర్లక్ష్యం చేస్తోందని పాత వాహనాలు ఇచ్చారని ఆరోపించారు. కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారని భద్రత తగ్గించారని అన్నారు. అయితే, దీనిపై పోలీస్ శాఖ స్పష్టత ఇచ్చింది. జగన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని చెప్పారు. ఆయనకు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉందని అన్నారు. కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి కేటాయించామని అధికారులు చెప్పారు. 

Also Read: YS Jagan : వైఎస్ జగన్‌ బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందా ? - ఇదిగో పోలీసులు ఇచ్చిన క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget