News
News
X

Jagan Speech At Plenary: సీఎం జగన్ ఏం మాట్లాడతారు? 2024 టార్గెట్‌గానే శ్రేణులను రెడీ చేస్తారా?

అప్పుడు పార్టి అద్య‌క్షుడు....ఇప్పుడు సీఎం కూడ‌..మ‌రి ఆయ‌న స్పీచ్ ఎలా ఉంటుంది..కార్య‌క‌ర్త‌ల‌కు కిక్ ఇస్తారా..

FOLLOW US: 

2017లో జరిగిన ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన జగన్... 2019 ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పారు. దాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. విజయాన్ని అందుకుంది పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్.. ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఉత్కంఠ శ్రేణుల్లో ఉంది.  

అప్పుడు పార్టీ అధ్యక్షుడు...ఇప్పుడు సీఎం కూడా మ‌రి ఆయ‌న స్పీచ్ ఎలా ఉంటుంది.. కార్య‌క‌ర్త‌ల‌కు కిక్ ఇస్తారా.. వైసీపీ ప్లీనరీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతోంది. సీఎం ఏం చెప్తారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా ఏమైనా ఉంటుందా...? ప్రస్తుతం వైసిపి వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు ఇదే చర్చ నడుస్తుంది.

వైసీపీ ప్లీనరీ మొట్ట మొదటిగా 2011లో ఇడుపులపాయలో జరిగింది. తర్వాత ప్రతిపక్షంలో ఉండగా  2017 లో జరిగింది. ఇప్పుడు మళ్లీ 2022లో అధికార పార్టీగా ప్లీనరీ జరుపుకుంటోంది వైసీపీ. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. వైసీపీ నేతల్లో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా ప్లీనరీలో చాలా ప్రాంతాల్లో బహిరంగంగానే ఇది వ్యక్తమైంది. ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు బయట  బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

 నాయకుల్లో ఉన్న అసహనం మరింత రాజుకోకుండా సీఎం ఎలాంటి సూచనలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. సామాన్య జనాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు మాట్లాడితే కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలకు అంత కిక్ ఉండ‌దని శ్రేణులు భావిస్తున్నారు. ఒక పక్క జనానికి ఏమి  చేస్తామో  చెబుతూ మరోపక్క కార్యకర్తలు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం మాట్లాడ‌తార‌ని అంటున్నారు పార్టీ నేతలు. మ్యానిఫెస్టోలో 95 శాతం అమలు  ఒకే... కానీ ప్రభుత్వంపై బయట అనేక రకాలుగా విమర్శలు వస్తున్నాయి. కేవలం బటన్ నొక్కడం డబ్బులు వెయ్యడం ఇదే పనా అనే  విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి ప్లీనరీ సాక్షిగా జగన్ సమాధానం  చెప్తారా అనేది కూడా చూడాలి.

ఈ మధ్య  జగన్ పదేపదే 175 సీట్లు  అంటున్నారు. 150పైగా గెలిచిన వారికి 175 సీట్లు గెలుస్తామని  చెప్పడం పెద్ద అతిశయోక్తి  కాదు.. కానీ  జగన్‌కు ఉన్న కాన్ఫిడెన్స్  ఏంటి.. ఇవన్నీ కూడా స్పీచ్ లో ఉండబోతున్నాయని పార్టి నేత‌లు ఆశతో ఎదురు చూస్తున్నారు. జగన్‌పై ఎంతో నమ్మకంతో ప్రజలు 150కిపైగా ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా... మధ్యతరగతి ప్రజలు ఆనందంగా ఉన్నారా...వీటికి  కూడా జగన్ తన స్పీచ్‌లో చెప్పాలి. తాజా రాజకీయ పరిణామాల.. ఎన్నికల అజెండా అభివృద్ధి.. ఈ మూడేళ్ళలో ఏమి చేశాం.. ఇంకా ఏమి చెయ్యాలి... ఇవన్నీ కూడా  జగన్  స్పీచ్ లో  ఉండే అవకాశం ఉంది.

కార్య‌క‌ర్త‌లే టార్గెట్, సంక్షేమ‌మే మ‌ర‌లా రిపీట్..

అవును...మ‌రలా అదే పంథాను జ‌గ‌న్ అవ‌లంభించేందుకు రెడీ అవుతున్నారు. సంక్షేమ‌మే ప్ర‌ధాన అజెండా..ఎవ‌రి నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ఎవ‌రు ఎలా మాట్లాడుకున్నా స‌రే, సంక్షేమం అనేదే ఫైన‌ల్ మాట‌. ఆ త‌రువాత ప్ర‌ధాన అజెండా కార్య‌క‌ర్త‌లు. ఈ రెండే జ‌గ‌న్ కీల‌కంగా భావిస్తున్నార‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ ప‌థకాలు ద్వారా జ‌నంలో ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం క‌లుగుతుంది. నిన్న ఉన్న‌ట్లు రేపు ఉండ‌దు. రేపు ఉన్న‌ట్లు మ‌రుస‌టి రోజు ఉండ‌దు. సో... అలాంట‌ప్పుడు అప్పుల విష‌యంలో అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. క‌రోనా ప‌రిస్థితులు లేకుంటే రాష్ట్రం ఆర్దిక ప‌రిస్దితి ఇంత ద‌య‌నీయంగా ఉండేది కాదు.. క‌రోనా వ‌ల‌న ప్ర‌భుత్వ‌మే కాదు, ప్ర‌పంచం కూడా ఇబ్బందుల్లో ఉంది. అలాంట‌ప్పుడు అప్పులు ఈ రోజు ఉండ‌వ‌చ్చు, రేపు ఆర్దిక వ‌న‌రులు పెంపొందించుకుంటే, ఆటో మెటిక్‌గా రాష్ట్రం అభివృద్దిలో ముందు ఉంటుంది. అందుకుగాను ముందు కుటుంబాల‌ను బ‌లోపేతం కావాలి. అందుకు వారికి కావాల్సిన వ‌న‌రుల‌ను ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని పార్టీ నేత‌లు బ‌హిరంగంగా అంటున్నారు. ఇలాంట‌ప్పుడు సంక్షేమ ప‌థకాలు, కార్య‌క‌ర్త‌లతోనే పార్టీకి భవిష్య‌త్ ఉంది అన‌టంలో సందేహం లేదంటున్నారు.

Published at : 07 Jul 2022 12:59 PM (IST) Tags: cm jagan guntur YSRCP Kadapa YSRCP Plenary

సంబంధిత కథనాలు

Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!

Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్

AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్

Payyavula Letter : ఏపీలో ఆర్టీఐ చట్ట ఉల్లంఘన - తక్షణం జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు పయ్యావుల లేఖ

Payyavula Letter  :  ఏపీలో ఆర్టీఐ చట్ట ఉల్లంఘన - తక్షణం జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు పయ్యావుల లేఖ

టాప్ స్టోరీస్

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?