అన్వేషించండి

YSRCP: బెస్టాఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ - విజయసాయిరెడ్డికి బై చెప్పిన వైఎస్ఆర్‌సీపీ

Vijaysai Reddy: విజయసాయిరెడ్డి కి వైఎస్ఆర్‌సీపీ బై చెప్పింది. భవిష్యత్ లో అనుకున్న లక్ష్యాలు సాధించాలని విష్ చేసింది.

YSRCP bids farewell to Vijayasai Reddy: రాజ్యసభ పదవికి, రాజకీయాలకు గుడ్ బై చెప్పాలన్న విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని తాము ఆమోదించనప్పటికీ... గౌరవిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై ట్విట్టర్ లో ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఓ పిల్లర్ గా ఉన్నారని.. బలంగా నిలబడ్డారని ..క్లిష్టమైన సమయాల్లో .. విజయాలు అందుకున్న సమయంలోనూ కీలక పాత్ర పోషించారని అభినందించారు. హార్టికల్చర్ లో కొనసాగాలన్న నిర్ణయాన్ని..  రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఆసక్తిని తాము గౌరవిస్తామన్నారు. వైసీపీకి మీ సేవలు ఎప్పుడూ అభినందించదగ్గవిగానే ఉంటాయన్నారు. విష్ యు వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అని.. వైసీపీ సమాధానం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ కు స్పందనగానే వైసీపీ ఈ ప్రకటన చేసింది.  

విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల వైఎస్ఆర్‌సీపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఓ రాజ్యసభ సీటు తగ్గిపోవడం మాత్రమే కాదు.. అది కూటమి పార్టీలకు వెళ్తుంది. అంతే కాదు జగన్ కు అత్యంత సన్నిహితుడు అక్రమాస్తుల కేసుల్లో నెంబర్ టు అయిన విజయసాయిరెడ్డి దూరం అయితే వైసీపీలో అలజడి రేగుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. వైసీపీ విజయం సాధించిన 2019లో ఆయన పాత్ర కీలకం. అందుకే విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోతారని .. రాజకీయాలకు దూరమవుతారని ఎవరూ అనుకోలేకపోయారు.కానీ ఆయన  గుడ్ బై చెప్పారు. 

రాజీనామా చేయడానికి ఆయన సహేతుకమైన కారణాలు కూడా చెప్పలేదు. అబద్దాలు ఆడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ఆయన చెప్పడం కామెడీగా మారింది. ఆయనతో ఎవరు అబద్ధాలు చెప్పించాలనుకున్నారు.. ఏ అబద్దాలు చెప్పించాలనుకున్నారో కూడా చెబితే బాగుండేదని అంటున్నారు. వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేసేందుకు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని అందులో విజయసాయిరెడ్డి భాగమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు నిష్ఠూరంగా వైసీపీ బై చెప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                          

ఇప్పటికే విజయసాయిరెడ్డిని పార్టీ కార్యక్రమాలో యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవిని ఇచ్చారు. అయితే ఆయన మొత్తం వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన వల్ల అవకాశాలు రాలేదని భావిస్తున్న కొంత మంది వైసీపీ నేతలు.. పార్టీకి మంచే జరుగుతుందని అంచున్నారు.               

Also Read: ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Embed widget