అన్వేషించండి

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు... గోవాలో సునీల్ అరెస్టు... విచారణలో వేగం పెంచిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులు కీలక అప్డేట్ వచ్చింది. పులివెందులకు చెందిన సునీల్ కుమార్ ను సీబీఐ గోవాలో అరెస్టు చేసింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ గోవాలో అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించారు. గోవాలో సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన అనంతరం మంగళవారం ఉదయం గోవాలోని స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌ను కడప తీసుకువచ్చి బుధవారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుస్తారని సమాచారం. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేక హత్య కేసు రాష్ట్రంలో  సంచలనం రేకెత్తించింది. ఆయన్ని తన ఇంటిలోనే 2019 మార్చి 15న గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించారని అప్పట్లో పోలీసులు తెలిపారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. 2019 మార్చి 15న హత్య జరిగిన రాత్రికి ముందు వివేకా ఎన్నికల ప్రచారానికి కారులో వెళ్లింది ఎర్ర గంగిరెడ్డి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్రగంగిరెడ్డి వెంట వెళ్లేవారు. దీంతో హత్యలో గంగిరెడ్డి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. హత్య జరిగిన రోజు ఉదయం ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎర్రగంగిరెడ్డితోపాటు కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముందుకు వెనుకకు ఊగిసలాడుతుంది. ఇప్పటికే చాలా సార్లు కడపలో అనుమానితులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ ఏడాది జూన్‌లో మళ్ళీ సీబీఐ విచారణ ప్రారంభించింది. కడపలోనే కాక పులివెందులలో కూడా విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ విచారణలో ఇప్పటి వరకూ ఆరుగురు అనుమానితులను విచారించారు. ఈ ఆరుగురు అనుమానితులు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగన్న, ఇనాయతుల్లాతో పాటు ఉమామహేశ్వరరెడ్డి ఉన్నారు. 

ఈ అనుమానితులు వివేకా హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయ్తత్నించారని ఆరోపణలు ఉన్నాయి. వివేకానందరెడ్డితో సన్నిహితంగా ఉన్నవారిని మాత్రమే  సీబీఐ పదే పదే విచారిస్తూ ఉండడం గమనార్హం. అనుమానితుల్లో ఎర్ర గంగిరెడ్డి వివేకకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు, చివరి సారిగా వివేకా ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిన వ్యక్తి కావడంతో అతడిని ప్రధానంగా విచారిస్తున్నారు. గంగిరెడ్డి సాక్ష్యాధారాలు చెరిపేశారన్న విషయంలో జైలు శిక్షకూడా పడింది. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటి వద్ద రంగన్న కాపలగా ఉన్నారు. గతంలో సిట్‌ అధికారులు రంగన్నకు నార్కో పరీక్షలు కూడా చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Missing Fishermen Safe: గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు క్షేమం.. బెంగాల్ తీరంలో ఆచూకీ లభ్యం
Missing Fishermen Safe: గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు క్షేమం.. బెంగాల్ తీరంలో ఆచూకీ లభ్యం
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget