అన్వేషించండి

YS Sharmila : ఆస్తి కోసం చిన్నాన్న హత్య జరగలేదు - వివేకా వ్యక్తిగత జీవితంపై ఆరోపణలను ఖండించిన వైఎస్ షర్మిల !

ఆస్తుల కోసం వైఎస్ వివేకా హత్య జరగలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు సరి కాదన్నారు.

 

YS Sharmila :   వైఎస్ వివేకానందరెడ్డి ఆస్తి కోసం జరగలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె..  తన చిన్నాన్న వివేకా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవన్నారు. ఆయనకు ఉన్న అరకొర ఆస్తులన్నీ  కుమార్తె  సునీత పేరుపై ఎప్పుడో రాశారని స్పష్టం చేశారు. ఆస్తి కోసమే హత్య చేయాలనుకుంటే.. ఆస్తులన్నీ సునీత పేరు మీద ఉన్నాయి కాబట్టి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సునీతను హత్య చేయాలన్నారు.  అదే సమయంలో వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ ఆయనో ఉమనైజర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.  చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయన సాధారణ జీవితం గడిపారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  మండిపడ్డారు.  చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఆయనేంటో కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని ఆయన ఆస్తులను రెండో భార్య షమీర్, వారి బిడ్డ షెహన్ షా పేరు మీద రాస్తారన్న కారణంగానే హత్య జరిగిందని వైఎస్ అవినాష్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్నారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి పలు వివాహేతర బంధాలు ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు. వీటి వల్లనే హత్య జరిగింది కానీ తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. అయితే చనపిోయిన వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై ఆయన క్యారెక్టర్ ను కించపరిచేలా చనిపోయిన తర్వాత ఆరోపణలు  చేయడం సంచలనం అయింది. కొన్ని మీడియాల్లోనూ ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనాలు రాయడంపై షర్మిల మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి గురించి చెత్త రాతలు రాస్తే అతను సంజాయిషీ ఇచ్చుకొలేడు అన్న కనీస విలువలు కూడా లేవా అని ప్రశ్నించారు. 

గతంలో వివేకానందరెడ్డి మంచి వారు, సౌమ్యుడని ఎవరికీ హానీ తలపెట్టరని అవినాష్ రెడ్డి ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు ప్రసంగించారు. ఇప్పుడు ఆయనే.. వివేకానందరెడ్డిపై రకరకాల ఆరోపణలు చేస్తూండటం చర్చనీయాంశమయింది.   ఈ అంశంపై మొదటి నుంచి వైఎస్ సునీత వైపు ఉన్న షర్మిల బయట పెద్దగా వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే చిన్నాన్న వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడంతో ఆమె స్పందించినట్లుగా తెలుస్తోంది.  షర్మిల స్పందన హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

వివేకా నందరెడ్డి హత్య విషయంలో గతంలోనే సీబీఐ వైఎస్ షర్మిల స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆమె ఏమి స్టేట్ మెంట్ ఇచ్చారో తెలియదు కానీ.. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆస్తులు, వివాహేతర సంబంధాలు కారణం అంటూ కొంత మంది చేస్తున్న ఆరోపణలను మాత్రం నిర్మోహమాటంగా ఖండించారు. ఈ విషయాలను ప్రచారం చేస్తున్న  మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.          

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget