YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్ !
YS Jagan to release YSRCP Manifesto: అమరావతి: వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. మిగిలిన పార్టీలు ఎన్ని కలిసొచ్చినా విజయం సాధించేది వైఎస్సార్ సీపీ (YSRCP)నే నని ఏపీ మంత్రులతో పాటు జగన్ పలుమార్లు చెప్పారు. దేశంలో ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ప్రకటించడానికి కొన్ని గంటల ముందు వైసీపీ 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాను జగన్ వెల్లడించారు. తాజాగా వైసీపీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
మేనిఫెస్టోను విడుదల చేయనున్న జగన్
ఎన్నికలు అనగానే వెంటనే గుర్తొచ్చేది పార్టీల మేనిఫెస్టో. ప్రజలకు తాము ఏం చేయబోతున్నాం, ఏ విధమైన పనులు చేస్తామో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటారు. అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. మార్చి 20వ తేదీన వైసీపీ మేనిఫోస్టోను జగన్ విడుదల చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదివరకే మేనిఫెస్టోపై కసరత్తు చేసిన జగన్, తుది మెరుగులు దిద్ది మరో 4 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ నేతలు దీనిపై స్పందిస్తే మరింత క్లారిటీ రానుంది. మేనిఫెస్టో అంటే తనకు భగవద్దీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథమని పదే పదే చెప్పే వైసీపీ అధినేత.. తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పథకాలు తీసుకురానున్నారు అని రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి పార్టీలు సైతం జగన్ ఈసారి ఏ వ్యూహాలతో బరిలోకి దిగుతారోనని చర్చ జరుగుతోంది.