By: ABP Desam | Updated at : 22 Sep 2023 04:19 PM (IST)
చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !
YS Bhaskar Reddy : చంచల్ గూడా జైలు నుండి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ పై విడుదలయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి..నిన్న సీబీఐ కోర్టు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేక కేసులో ఏప్రిల్ 16న భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది సీబీఐ..అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు 12 రోజుల పాటు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఎస్కార్ట్‌కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది.
ఆరోగ్య కారణాలతో 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య.. కేసులో అరెస్ట్ అయి.. జైల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు మధ్యంతర బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి రిలీజయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. భాస్కర్ రెడ్డి హెల్త్ బాలేదని కోర్టుకు చంచల్‌గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో.. న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 న చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండర్ అవ్వాలని న్యాయమూర్తి భాస్కర్ రెడ్డిని ఆదేశించారు.
గతంలో రెగ్యులర్ బెయిల్ తిరస్కరించిన కోర్టు
వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు కుట్రదారుల్లో భాస్కర్ రెడ్డి ఉన్నట్టు సీబీఐ తెలిపింది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. కుట్ర, హత్య, ఆధారాలను మాయం చేసినట్టు కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సీబీఐ కోర్టు.. సునీత, సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని భాస్కర్ రెడ్డి తరఫు లాయర్‌కి న్యాయస్థానం స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డిది కీలక పాత్రని.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్‌ను తిరస్కరించింది.
విచారణలో మరికొందరి బెయిల్ పిటిషన్లు
వివేకా హత్య కేసులో మరికొందరి బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వివేకా హత్య కేసులో ఏ 8గా ఉన్న అవినాష్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
Trains Cancelled: విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>