Ys Bharathi: సీఎం జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం - జనం మధ్యలో నుంచి అభివాదం చేసిన సీఎం సతీమణి భారతి
Andhrapradesh News: వైసీపీ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అరుదైన దృశ్యం నెలకొంది. తాడేపల్లి జంక్షన్ వద్ద సీఎం సతీమణి జనం మధ్యలో నుంచి సీఎం జగన్ కు అభివాదం చేశారు.

Ys Bharathi Welcomes CM Jagan: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ (CM Jagan) ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి (Tadepalli) సీఎం వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సీఎం జగన్ బస్సు యాత్ర తాడేపల్లికి జంక్షన్ కు చేరుకోగానే.. ఆయన సతీమణి వైఎస్ భారతి (Bharathi) జగన్ కు అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ఆమె అభివాదం చేయగా.. ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్ ఆమెకు అభివాదం చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అక్కడి వారు వైఎస్ భారతితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఆమె.. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
తాడేపల్లి జంక్షన్లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైయస్ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి.
— YSR Congress Party (@YSRCParty) April 13, 2024
బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన శ్రీమతి వైయస్ భారతి, ప్రతిగా బస్సులో నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
ప్రజలు, అభిమానుల మధ్య నుంచే… pic.twitter.com/I9RYScAab9
ప్రకాశం బ్యారేజీపై..
అనంతరం, సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడ చేరుకుంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీపై చేరుకున్న బస్సు యాత్రను చూసేందుకు అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జగన్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Also Read: Jagan : ఇంటి స్థలాలివ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే - మంగళగిరి చేనేతల సమావేశంలో జగన్ విమర్శలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

