![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cm jagan: షర్మిలకు జగన్ హ్యాండ్ ఇస్తారా?
రాఖీ పండగ దగ్గరికొచ్చేస్తుంది. మరి తెలుగు రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఏపీ సీఎం జగన్ కు షర్మిల రాఖీ కడతారా? ఇంతకీ వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారా?
![Cm jagan: షర్మిలకు జగన్ హ్యాండ్ ఇస్తారా? Will Sharmila tie a Rakhi to Jagan Cm jagan: షర్మిలకు జగన్ హ్యాండ్ ఇస్తారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/72fe8143d08226549153fadf16f29963_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాఖీ పండగ వస్తోంది.. సీఎం జగన్ చెల్లెలు షర్మిల.. అన్నయ్యకు రాఖీ కట్టడానికి వెళ్తారా? కొన్ని రోజులుగా మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమె జగన్ తో మాట్లాడతారా? ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఆమె వెళ్లారని కొందరంటుంటే.. అసలు రాజకీయానికి రక్త సంబంధానికి పోలిక ఏంటని.. ఆమె వెళ్తుందని మరికొందరు చెబుతున్నారు.
వైఎస్ఆర్ జయంతి రోజునే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. అదే రోజు తన అన్న జగన్ పై కామెంట్లు చేశారనే చర్చ జరిగింది. అంతకుముందు షర్మిలపై జగన్ పరోక్షంగా కామెంట్స్ చేశారనే వార్తలూ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వరకూ వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని చాలామంది నేతలు చెప్పుకొచ్చారు. కానీ.. పార్టీ ప్రకటన సమయంలో జరిగిన పరిణామాలతో వివాదం ఉందనే మెసేజ్ ఓ విధంగా జనాల్లోకి వెళ్లినట్టైంది. కొన్ని కామెంట్లు, పంచ్ లు ఇద్దరు కావాలనే వేసుకున్నారనే మాటలు వినిపించాయి. అసలు పార్టీ పెట్టడం వెనక జగన్ కూడా ఉన్నాడని.. కూడా వార్తొలొచ్చాయి.
కొన్ని రోజుల క్రితం.. తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై మాట్లాడిన జగన్.. పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టం లేదంటూ చెప్పారు. ఆ తర్వాత దానికి కౌంటర్ అన్నట్టు.. పార్టీ ప్రకటన రోజు పంచ్ లు విసిరారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధించడమే లక్ష్యమని షర్మిల చేసిన కామెంట్స్ తో పరోక్షంగా అన్న జగన్ ను విమర్శించినట్టైందని చర్చ నడిచింది. కలిసి భోజనం చేసి.. స్వీట్లు తినిపించుకునేంత క్లోజ్ ఉన్నప్పుడు కూర్చొని జలవివాదంపై మాట్లాడుకోలేరా అంటు షర్మిల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ మాటలతో కేసీఆర్ తో పాటు జగన్ పైనా షర్మిల కామెంట్స్ చేశారు.
అయితే కొన్నేళ్లుగా జగన్, షర్మిల కలిసే.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్తారు. తండ్రి సమాధికి నివాళులు అర్పిస్తారు. కానీ మెున్న జయంతి సమయంలో వేర్వేరుగా వైఎస్ఆర్ సమాధి వద్దకు వెళ్లారు. ప్రతిసారి కలిసి వెళ్లి కిందటిసారి మాత్రమే విడివిడిగా వెళ్లడంపై జనాల మధ్య కూడా చర్చ నడిచింది.
ఇలాంటి కొన్ని పరిణామాల కారణంగా ఇంతకీ జగన్ కు షర్మిల రాఖీ కడతారా? అనే చర్చ నడుస్తుంది. లేదు లేదు.. రక్త సంబంధం కదా.. వాళ్ల గొడవలు వ్యక్తిగతం కాదని కొందరు అంటున్నారు.. ఇంట్లో జరుపుకొనే పండగకు రాజకీయానికి సంబంధం ఏంటని చెబుతున్నారు. ఎలాగైనా ఇంట్లో ఆనందంగా గడుపుతారంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)