అన్వేషించండి

Dhramavarm Ticket Race: ధర్మవరం అసెంబ్లీ టికెట్ ఎవరికీ ? బీజేపీ నుంచి రేసులో ఇద్దరు నేతలు

Andhra Pradesh Elections 2024: ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయంపై కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు. అందుకే అసెంబ్లీ అభ్యర్థిని ఇప్పటివరకూ ప్రకటించలేదు.

Dharmavaram Assembly ticket: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్ ఎవరికీ అన్నదానిపైన స్పష్టత రాకపోవడం ఒకటైతే రోజుకొక పేరు తెరపైకి వస్తుండడంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీలు నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి నేత పరిటాల శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా పరిటాల శ్రీరామ్ టీడీపీని నడిపించారు.

మొదట టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం ధర్మవరం అసెంబ్లీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ధర్మవరంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పొత్తుల భాగంగా టికెట్ తనకే కేటాయిస్తారని జనసేన నేతలతో చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన, టిడిపి, బిజెపితో జత కట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి. అదే నియోజకవర్గంలో బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను తనకే కేటాయిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురి నేతల మాటలతో నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి క్యాడర్ అయోమయ పరిధిలో పడింది. టికెట్ ఎవరికి ఇచ్చిన నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జెండా ఎగరవేయాలని అధినేతలు భావిస్తుంటే నియోజకవర్గం లో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుంది అంటూ ప్రచారం చేసుకోవడం కూటమి పార్టీలకు మరో తలనొప్పిగా మారింది. కూటమి చర్చల అనంతరం సత్యసాయి జిల్లాలో బిజెపికి ఒక పార్లమెంటు స్థానం ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కోరింది. దానికి అనుగుణంగానే మొదటగా హిందూపురం పార్లమెంటు స్థానం మరియు ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. 

బిజెపి నుంచి టికెట్ కోసం ఇద్దరు పోటీ ?
మూడు పార్టీల పొత్తు అనంతరం జిల్లాలో ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొదటగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీటు కేటాయిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందూపురం పార్లమెంటు స్థానాన్ని పరిపూర్ణానంద స్వామికి కేటాయిస్తున్నట్లు బిజెపిలోని సీనియర్ నేతలు కొంతమంది వెల్లడించారు. అనంతరం జరిగిన చర్చలలో  కూటమినేతలు మరోసారి సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపిన తరువాత హిందూపురం పార్లమెంటు స్థానాన్ని టిడిపికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధిని అభ్యర్థిగా ప్రకటించారు.

ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్, జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీపడుతున్నారు. గత కొంతకాలంగా ఎవరికి వారు నియోజకవర్గంలో బల ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తైతే అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పేరు బయటికి రావడంతో అసలు ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. కూటమి అభ్యర్థిగా బిజెపికి కేటాయిస్తే ఖచ్చితంగా గోనుగుంట్ల సూర్యనారాయణకి సీటు అని అందరూ అనుకున్న తరుణంలో అదే పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు రావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. అసలు ధర్మవరం అసెంబ్లీ టికెట్ కూటమిలో ఎవరికి కేటాయిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Quinton de Kock 97 vs RR IPL 2025 | ఐపీఎల్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డికాక్ | ABP Desam#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Salman Khan: 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
Venky Atluri : పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Embed widget