By: ABP Desam | Updated at : 01 Jan 2023 10:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హరిరామజోగయ్య ఆసుపత్రికి తరలింపు
Palakollu News : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాలకొల్లులోని ఆ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్షకు సిద్ధమైతే హరిరామ జోగయ్యను తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. హరిరామ జోగయ్య ఇంటికి వెళ్లిన డీఎస్పీ మనోహరాచారి ఆయనతో చర్చలు జరిపారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా దీక్ష చేపట్టడం మంచిది కాదని డీఎస్పీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నుంచి దీక్ష చేస్తానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య స్పష్టం చేశారు. తనను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టినా, ఆసుపత్రికి తరలించినా అక్కడే దీక్ష కొనసాగిస్తానన్నారు. ఆయన ఇంటి వద్దకు కాపు సంక్షేమ సేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హరిరామ జోగయ్యను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. కాపు రిజర్వేషన్లపై పోరాటానికి సిద్ధమైన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారని కాపు నేతలు ఆరోపిస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం
కాపు రిజర్వేషన్ల సాధించడానికి తాను చావడానికైనా సిద్ధమని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి అల్టివేటం జారీ చేశారు. సోమవారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. పాలకొల్లులోని గాంధీ సెంటర్‌లో రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తానని హరిరామజోగయ్య తెలిపారు. నిరాహార దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదన్నారు. దీక్షను భగ్నం చేసినా, ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తానని హరిరామజోగయ్య చెప్పారు. కాపులు ఆర్థికంగా ఎదగడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో కాపులకు చేసిందేంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాహారదీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి డిసెంబర్ 30 వరకు డెడ్ లైన్ పెట్టారు హరిరామజోగయ్య. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు.
నిరాహార దీక్ష
ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈనెల 30లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య తెలిపారు.
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ