By: ABP Desam | Updated at : 09 Mar 2022 07:15 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
AP Weather Updates: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నిన్నటితో తగ్గింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో వేడి అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో తమిళనాడుతో వాతావరణం నేడు సైతం చల్లగా ఉంటుంది. తీరం వెంట చలి గాలులు ప్రభావం చూపుతాయి.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎండ వేడి మధ్యాహ్నం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు (Southeasterly winds prevail over Andhra Pradesh) వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో వాతావరణంలో ఉక్కపోత అధికం అవుతుంది. మరోవైపు రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. బాపట్లలో 20 డిగ్రీలు, కాకినాడలో 22.5 డిగ్రీలు ,కళింగపట్నంలో 20.2 డిగ్రీలు, నందిగామలో 21.2 డిగ్రీలు, నెల్లూరులో 24.6 డిగ్రీలు, తునిలో 22.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 21.2 డిగ్రీలు, అమరావతిలో 21.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. మార్చి 12 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఎండ మండిపోతోంది. నంద్యాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న మూడు రోజుల దాక ఇలాగే కొనసాగనుంది. ఆరోగ్యవరం, అనంతపురంలో కొన్ని చోట్ల చలిగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఆరోగ్యవరంలో 29 డిగ్రీలు ఉండగా, రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు నమోదైంది.
7 Day forecast for Andhra Pradesh dated 08.03.2022 pic.twitter.com/tQ97U3hMWT
— MC Amaravati (@AmaravatiMc) March 8, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.
Also Read: Gold-Silver Price: భారీగా ఎగబాకి ఆగిన పసిడి ధర, వెండి దిగువకు - నేటి ధరలు ఇవీ
Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!
Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!
Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య, అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి
Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు
Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ