అన్వేషించండి

Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన, తెలంగాణలో పొడి వాతావరణం

Rains In AP Telangana: శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం అవుతుంది. అక్టోబర్ 29 నుంచి వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు.

Rains in Telangana AP: సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం అవుతుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి.  

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాతావరణ శాఖ ముందుగా తెలిపినట్లే సిత్రాంగ్ తుపాను ఏపీపై ప్రభావం చూపలేదు. సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటడంతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోనూ వర్షాలు లేవు. ఇక్కడ కూడా సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. రోజురోజుకూ చలి తీవ్రత అధికం కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget