Weather Updates: కొన్ని రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు - భానుడి ప్రతాపం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉపశమనం
Rains In Andhra Pradesh: ఏపీ, యానాంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Updates: దక్షిణాది రాష్ట్రాల్లో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీ, యానాంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటకలో, తమిళనాడులోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు మరింత చల్లగా మారనుంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులు, చలిగాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని తెలిపారు.
Daily weather report for Andhra Pradesh Dated 10.04.2022. pic.twitter.com/ZpMSCQpQ07
— MC Amaravati (@AmaravatiMc) April 10, 2022
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దిగొచ్చాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తేలికపాటి జల్లులతో రాయలసీమ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. 40 దాటిన ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా దిగొస్తున్నాయి. అత్యధికంగా అనంతపురంలో 38.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 36 డిగ్రీలు, కర్నూలులో 38.6 డిగ్రీలు నమోదైనట్లు అమరావతి కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రతో పోల్చితే ఇక్కడ ఉష్ణోగ్రతలు కనీసం 3, 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి.
Fisherman warning for Andhra Pradesh for next 5 days Dated 10.04.2022. pic.twitter.com/6ZppwPHE5C
— MC Amaravati (@AmaravatiMc) April 10, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Telangana Temperature Today)
బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. అయితే ఏపీలో లాగ ఉష్ణోగ్రతలు దిగిరాలేదు. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఊరట లభించింది. ఇటీవల ఇక్కడ 40 డిగ్రీలు టచ్ అయిన ఉష్ణోగ్రతలు తాజాగా 37.2 డిగ్రీలుగా నమోదైంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా 40.1 డిగ్రీలు, ఆ తరువాత ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.