Weather Alert: ఏపీలో వానలు.. ఆ జిల్లాల్లో ఎఫెక్ట్.. ఈశాన్య రుతుపవనాల రాక
ఉత్తర తమిళనాడు.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కొస్తాలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలులో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
District forecast and warnings for Andhra Pradesh dated 25.10.2021 pic.twitter.com/omY6KsDlPL
— MC Amaravati (@AmaravatiMc) October 25, 2021
ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోందని.. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగాఈశాన్య రుతుపవనాలు రాష్ట్రం లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పారు. ఈశాన్య గాలులు వీయడం ద్వారా ఇవాళ ఈశాన్య రుతుపవనాలు వస్తాయని అంచనా వేశారు. ఒకరోజు ముందుగానే సోమవారం దక్షిణ, ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటకల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
7 day Mid-day forecast for Andhra Pradesh dated 24.10.2021 pic.twitter.com/9s2K8l8sGm
— MC Amaravati (@AmaravatiMc) October 25, 2021
అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలల సీజన్‌లో దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. వచ్చే 48 గంటల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.
Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?