![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Latest Update: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీ, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా, నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు
తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
![Weather Latest Update: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీ, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా, నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు Weather in Telangana Andhrapradesh Hyderabad on 25 August 2022 latest updates here Weather Latest Update: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీ, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా, నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/79517f90e428c5f2086f40a9a62e786b1661393141197234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Latest News: ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ పై ఈ వాయు గుండం ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని వివరించారు.
అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో నేటి నుంచి వచ్చే 4 రోజుల పాటు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
Weather warnings for Andhra Pradesh for next five days dated 24.08.2022 pic.twitter.com/QVVoFXP0Sc
— MC Amaravati (@AmaravatiMc) August 24, 2022
26వ తేదీన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వాతావరణ విభాగం వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లా్ల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులుహెచ్చరించారు. అరటి తోటలు సహా కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 24, 2022
‘‘రాష్ట్రంలో కోస్తా భాగాల మీదుగా ఏర్పడుతున్న రెండు ఉపరితల ఆవర్తనాల వల్ల ఈ రోజు నుంచి వర్షాలు జోరందుకోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నగరం పరిసరాలు, అనకాపల్లి, పాడేరు (అరకు వ్యాలీ), ఉభయ గోదావరి జిల్లాలోని పలు భాగాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలను చూడగలం. ఇవి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడాలంటే ఒకటి తెలంగాణ నుంచి మన వైపుగా రావాలి, లేదా ఒడిషా నుంచి రావాలి లేదా రాయలసీమ నల్లమల అటవి నుంచి రావాలి. ఈ సారి మాత్రం రాత్రి రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరులో మొదలై నెల్లూరు, ప్రకాశం మీదుగా బాపట్ల గుంటూరు, విజయవాడ జిల్లాల్లోకి ఈ రోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారిజామున వర్షాలు విస్తరించనుంది. రేపు తెల్లవారిజామున ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుండనుంది. మరో వైపున తెలంగాణ హైదరాబాద్ లో అర్ధరాత్రి రేపు తెల్లవారిజామున వర్షాలను మనం చూడగలము’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)