అన్వేషించండి

Weather Updates: రెయిన్ అలర్ట్, ఏపీలో అక్కడ తేలికపాటి వర్షాలు, తెలంగాణలో చలికి గజగజ

Rains In Andhra Pradesh: తూర్పు దిశ నుంచి గాలుల ప్రభావం తగ్గగా, మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. నేడు కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి.

Synoptic features of weather inference for Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలుల ప్రభావం తగ్గగా, మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.  చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 15.9 డిగ్రీలు, నందిగామలో 17.1 డిగ్రీలు, బాపట్లలో 19.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్యలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు.

View this post on Instagram
 
A post shared by Amaravati AP (@mc_amaravati)

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో ఏకంగా 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 18.6 డిగ్రీలు, కర్నూలులో 19.2 డిగ్రీలు, తిరుపతిలో 19.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి.

తెలంగాణలో చలి
తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాలు లేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతలు అంతగా పెరగడం లేదు.

Also Read: ISRO launches PSLV-C52: నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-52

Also Read: Gold-Silver Price: నిన్న దడ పుట్టించి, నేడు స్వల్పంగా ఎగబాకిన పసిడి, వెండి మాత్రం స్థిరంగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Embed widget