By: ABP Desam | Updated at : 28 Nov 2021 07:15 AM (IST)
ఏపీ, తెలంగాణలో వర్షాలు (Representational Image)
Weather Updates: ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం నుండి శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం నవంబర్ 29న ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ బలపడి మరో 24 రోజుల్లో వాయుగుండంగా మారనుందని తెలిపారు.
వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇటీవల వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వార్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో గరిష్టంగా 7 నుంచి 11 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కానుంది.
దక్షిణ కోస్తాంద్ర, యానాంతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతం తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేగంగా గాలులు వీస్తాయి. మత్స్యకారులను అధికారులు అలర్ట్ చేశారు. డిసెంబర్ 1 వరకు వేటకు వెళ్లకూడదని మత్స్యాకారులకు సూచించారు. వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లు జలమయం కానున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. వర్షపు నీరు నిలిచిపోవడం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తనుంది. పాత భవనాలలో ఉండకూడదని, అలాంటి బిల్డింగుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని సూచించారు.
Also Read: Gold-Silver Price: ఏకంగా రూ.210 పెరిగిన పసిడి ధర.. వెండి స్థిరంగా.. తాజా ధరలు ఇవీ..
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 27, 2021
తెలంగాణలోనూ వర్షాలు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడున్ను అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు హైదరాబాద్‌తో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. నగర శివార్లలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి స్వల్ప వర్షపాతం నమోదు కావొచ్చునని వాతావరణశాఖ తెలిపింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!