Weather Updates: హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, అక్కడ మాత్రం చలి తీవ్రత తగ్గలేదన్న వాతావరణ కేంద్రం
Weather Updates In AP And Telangana: గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు తాజాగా భారీగా పెరిగాయి. అయితే కొన్నిచోట్ల మాత్రం చలి తీవ్రత అలాగే ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒకట్రెండు చోట్ల మాత్రమే 20 కంటే తక్కువ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం (Daily weather report of Andhra Pradesh)లో ఏ మార్పులు లేవు. వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రలు గత రెండు రోజుల నుంచి విపరీతంగా పెరుగుతుండటంతో పగటి వేళ కొన్నిచోట్ల ఉక్కపోత అనిపిస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 18.6 డిగ్రీలు, బాపట్లలో 19.1 డిగ్రీలు, అమరావతిలో 19.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
View this post on Instagram
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఆరోగ్యవరం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. నంద్యాలలో 18.8 డిగ్రీలు, తిరుపతిలో 20 డిగ్రీలు, కర్నూలులో 20.9 డిగ్రీలు, అనంతపురంలో 20 డిగ్రీలు, కడపలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హీటెక్కుతోన్న తెలంగాణ (Telangana Weather Updates)
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. అయినా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: Telangana IT Minister కేటీఆర్‌కు అరుదైన గౌరవం, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు ఆహ్వానం