AP Graduate MLC Results : ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి షాక్ - రెండింటిలో టీడీపీకి భారీ ఆధిక్యం !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. రెండు చోట్ల టీడీపీ, ఒక్క చోట వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
AP Graduate MLC Results : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తిరుగులేని విజయాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకకర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందనంత మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి లీడ్‌లోఉ న్నప్పటికీ అదిచాలా స్వల్పం. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి.
ఉత్తరాంద్రలో టీడీపీ భారీ ఆధిక్యం - ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాయి. మొత్తం 8 రౌండ్లలో టీడీపీ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. అయితే విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లు రాలేదు. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లతో మొత్తం పోలైన ఓట్లు 2,13,035 కాగా.. ఇందులో 12,318 ఓట్లు చెల్లలేదు. ఏవరైనా అభ్యర్ధి విజయం సాధించాల్సిన మొదటి ప్రాధాన్యతా ఓట్ల కోటా 94509. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి 82958 ఓట్లు వచ్చాయి. విజయం సాధించేందుకు ఇంకా చిరంజీవిరావుకు 11551 ఓట్లు అవసరం. మొదటి ప్రాధాన్యతా ఓట్ల కోటా పూర్తి కాకపోవడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ కు వెళ్ళాలని ఎన్నికల అధికారుల నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్దిని ఎలిమినేట్ చేస్తూ అతనికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను సంబధిత అభ్యర్థికి కలుపుతూ వెళ్తారు. ఈ ప్రక్రియలో గెలవడానిక అవసరమైన ఓట్లు అభ్యర్థికి వచ్చిన తర్వాత కౌంటింగ్ఆపేసి.. విజేతను ప్రకటిస్తారు.
తూర్పు రాయలసీమలో టీడీపీ ఆధిక్యం - ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ కూడా ముగిసింది. లి ప్రాధాన్యతలో అభ్యర్థులకు పూర్తి స్ధాయి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తున్నారు. టిడిపి అభ్యర్థి శ్రీకాంత్ కి 1,12,514 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,252 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక టిడిపి అభ్యర్థి శ్రీకాంత్ కు సుమారు 25731 ఓట్లు మెజారిటీ ఉంది. పీడీఎఫ్ మీగడ వెంకటేశ్వర రెడ్డి 38,001 ఓట్లు వచ్చాి. మొత్తం మొత్తం ఓట్లు 2,69,339 పోల్ కాగా ఇందులో చెల్లని ఓట్లు 20,979గా గుర్తించారు. లెక్కించిన ఓట్లు 2,48,360 కావడంతో ఇందులో యాభై శాతం తెచ్చుకున్న వారు విజేతలవుతారు. టీడీపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 28 వేలు ఆధిక్యం ఉంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఆయన విజయం సాధించే అవకాశం ఉంది.
పశ్చిమ రాయలసీమలో హోరా హోరీ !
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీ సాగుతోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యలో కొనసాగుతున్నారు. ఆరో రౌండ్ తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఆభ్యర్థికి పధ్నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఉంది. కౌంటింగ్‌లో 10 నుంచి 11 రౌండ్లు కొనసాగనున్నాయి.ఈ స్థానంలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. ఆరో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 150కిపైగా ఓట్ల మెజార్టీ లభించింది. ఈ స్థానం ఫలితం శనివరం ఉదయానికి వెల్లడించే అవకాశం ఉంది.