అన్వేషించండి

SIR in Andhra Pradesh: ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు

ఏపీ ఓటర్ల జాబితా సవరణకు నేడే ఆఖరి గడువు కాగా, జులై 21న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. ఓటర్లు తమ ఓటర్ ఐడీ స్టేటస్ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల సవరణ గడువు పొడిగించాలని CEO కోరారు.
  • రాష్ట్రంలో 39.81 లక్షల ఓటర్ల పత్రాలు సేకరించలేకపోయారు.
  • మరణించిన, వలస వెళ్ళిన ఓటర్ల పత్రాలు అత్యధికంగా ఉన్నాయి.
  • జులై 21న ముసాయిదా విడుదల; ఓటు హక్కు కాపాడుకోండి.

 AP Voter List | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను బూత్ స్థాయి అధికారులకు BLOs సమర్పించడానికి నేడు (మంగళవారం) చివరిరోజు. గడువు ముగుస్తున్న క్రమంలో ఎన్యూమరేషన్‌ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్‌ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పలు నియోజకవర్గాల్లో ఇంకా 5 నుండి 10 శాతం మేర డిజిటైజేషన్ పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాజకీయ పక్షాలు, జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను ఈ లేఖతో పాటు పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించాల్సి ఉంది. 

39.81 లక్షల అన్‌ కలెక్టబుల్‌ పత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 39.81 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ పత్రాలు సేకరించడానికి వీలుపడకుండా అన్‌ కలెక్టబుల్‌ గా మిగిలిపోయినట్లు ఈసీ తెలిపింది. సుమారు 14.19 లక్షల పత్రాలు చనిపోయిన వారివి కాగా, మరో 12.14 లక్షల పత్రాలు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. బీఎల్‌వోలు ఎంత ప్రయత్నించినా అందుబాటులో లేని, ఫోన్లకు స్పందించని ఓటర్ల పత్రాలు 7.26 లక్షల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.

 నియోజకవర్గాల వారీగా చూస్తే తిరుపతి, కడప, గుంటూరు పశ్చిమ, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటి సేకరించలేని పత్రాల సంఖ్య ఎక్కువగా ఉండగా.. నర్సాపురం, భీమవరం, ఆచంట వంటి నియోజకవర్గాల్లో చాలా తక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 98.32 శాతం మంది పత్రాలను ఎన్నికల సంఘం విజయవంతంగా డిజిటైజ్ చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. లేకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో పేరు ఉండదని, తద్వారా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 

Also Read: Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ

ఇప్పటికే పత్రాలను సమర్పించిన వారు, తమ వివరాలు పోర్టల్‌లో డిజిటైజ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఈసీఐ నెట్ (ECI Net) యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in) ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబరును నమోదు చేయడం ద్వారా ఈ వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు..

షెడ్యూల్, కీలక మైలురాళ్లు 
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం, ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితితో జరుగుతుంది. 

జులై 21: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజున తాజా జాబితాను ప్రదర్శిస్తారు.

జులై 21 నుండి ఆగస్టు చివరి వారం వరకు: అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవడానికి (ఫారమ్-6), తప్పుల సవరణకు (ఫారమ్-8) ఈ సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబర్- అక్టోబర్: అందిన దరఖాస్తులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్.

జనవరి (వచ్చే ఏడాది): తుది ఓటర్ల జాబితా విడుదల.

'అన్ కలెక్టబుల్' ఓటర్లపై తదుపరి చర్యలు
బీఎల్‌వోలు (BLO) సేకరించలేకపోయిన అన్ కలెక్టబుల్ 39.81 లక్షల ఓటర్ల వివరాలపై తప్పుడు తొలగింపులు జరగకుండా ఎన్నికల సంఘం కఠినమైన మార్గదర్శకాలనుఅనుసరిస్తుంది. కేవలం బీఎల్‌వోకు వివరాలు దొరకలేదనే కారణంతో ఓటును జాబితా నుండి తొలగించరు. చిరునామా మారినట్లు లేదా ఓటరు అందుబాటులో లేనట్లు అనుమానం ఉన్న పేర్లకు మొదట 7 నుండి 15 రోజుల ముందస్తు నోటీసు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులు (BLA) కూడా ఈ 'అన్ కలెక్టబుల్' జాబితాను పరిశీలించి, వారు నిజంగానే ఆ ప్రాంతంలో లేరని ధ్రువీకరించాల్సి ఉంటుంది.

Frequently Asked Questions

ఓటర్ల జాబితా ప్రక్రియ గడువు పొడిగింపును ఎవరు కోరారు?

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి 10 రోజుల గడువు పొడిగింపు కోరారు. కొన్ని నియోజకవర్గాల్లో డిజిటైజేషన్ ఇంకా పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం.

'అన్ కలెక్టబుల్' ఓటర్లు అంటే ఎవరు? వారి సంఖ్య ఎంత?

సేకరించడానికి వీలుపడని 39.81 లక్షల మంది ఓటర్ల పత్రాలను 'అన్ కలెక్టబుల్' అంటారు. వీరిలో చనిపోయినవారు, వలస వెళ్లినవారు, అందుబాటులో లేనివారు ఉన్నారు.

నా ఓటరు వివరాలు డిజిటైజ్ అయ్యాయో లేదో ఎలా తనిఖీ చేయాలి?

ఓటర్లు తమ వివరాలు డిజిటైజ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ECI నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు నంబరును ఉపయోగించి తనిఖీ చేయవచ్చు.

ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించకపోతే ఏం జరుగుతుంది?

పత్రాలు సమర్పించకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో పేరు ఉండదు. దీనివల్ల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

తుది ఓటర్ల జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది?

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, వచ్చే ఏడాది జనవరిలో తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget