అన్వేషించండి

Vizag Steel Plant Lands for Sale : విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి రంగం సిద్ధం - ఫర్ సేల్ ప్రకటన విడుదల !

Vizag Steel Lands : వైజాగ్ స్టీల్స్ భూముల అమ్మకానికి ప్రకటన విడుదల చేశారు. వైజాగ్‌లో భూముల్ని ప్లాట్ల వారీగా విడదీసి అమ్మకానికి పెట్టారు. పూర్తి ప్రకటన వైజాగ్ స్టీల్ వెబ్ సైట్‌ లో పెట్టారు.

Vizag  Steel Plant Lands for Sale :  విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల్ని అమ్మేయడానికి ప్రకటన వెలువడింది.  జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్‌ ఎన్‌బీసీసీ, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల అమ్మకం జరుగుతోంది.  స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన రూ.1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి, అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వంతో తాము అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ఎన్‌బీసీసీ ఇంతకు ముందే ప్రకటన చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు అమ్మకానికి రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పెట్టింది. వైజాగ్ స్టీల్ వెబ్ సైట్ లోనూ అమ్మకపు వివరాలు ఉన్నాయి. 

హెచ్‌బీ కాలని, మద్దిల  పాలెం, పెదగంట్యాడ స్థలాల విక్రయం 
 
స్టీల్‌ ప్లాంట్‌కు వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. నేరుగా ప్లాంట్‌ ఉన్న ప్రాంతంలోనే 6 వేల ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. దీంతో పాటు ఉద్యోగుల క్వార్టర్స్‌, అనుబంధ భవనాల రూపంలో పలు చోట్ల భూములు ఉన్నాయి. వీటిలో నగరంలోని మద్దెలపాలెం, హెచ్‌బీ కాలనీ, పెదగంట్యాడ  ప్రాంతాలకు చేరువలో 22.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్ట్రర్స్‌ ఉన్నాయి.  దీని విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1540 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల వేలం జరుగుతుంది. 

అభివృద్ధి చేసి విక్రయించేలా ఎన్‌బీసీసీతో ఒప్పందం 

విశాఖ నగరంలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌ భూమిని అభివృద్ధి చేసి తర్వాత విక్రయించేలా  కేంద్ర ప్రభుత్వం- జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ (ఎన్‌బీసీసీ) మధ్య గత ఏడాది  ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు.  గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా మటుకు శిధిలం అయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లను రిపేర్లు చేయించుకుని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్‌ కాంప్లెక్స్‌తో పాటు నివాసాలు కూడా నిర్మించేందుకు ఎన్‌బీసీసీ ఒప్పందం చేసుకుంది. అభివృద్ధి చేసి విక్రయించేది ఎన్‌బీసీసీ అయితే.. స్థలాలను విక్రయించేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్.  

ఆర్థిక కష్టాల్లో స్టీల్ ప్లాంట్ !
 
విశాఖ ఉక్కు కోసం 19,000 ఎకరాల భూములు సేకరించారు. అందు లో 6,000 ఎకరాలు గ్రీన్‌ బెల్ట్‌ కింద వదిలేశారు. ఇది పోను మిగతా భూమి లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో స్థలాలు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు.  స్టీల్‌ ధరలు తగ్గటంతో గత రెండు మూడేళ్లుగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలు చవిచూస్తోంది.   రూ.23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్‌ఐఎన్‌ఎల్‌ను కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనడంతో టన్నుకు రూ.6,000 వరకు భారం పడుతోంది. భూముల అమ్మకం ద్వారా కొంత వరకూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget