అన్వేషించండి

AP Hospitals: ఏపీ ఆస్పత్రులకు అరుదైన గౌరవం

AP Hospitals: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలోని రెండు ఆసుపత్రులకు నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్ కేర్‌ ప్రొవైడర్‌(NABH) అక్రిడిటేషన్‌ లభించింది.

AP Hospitals: విశాఖపట్నంలోని ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, మానసిక ఆరోగ్య ఆస్పత్రులకు అరుదైన గౌరవం లభించింది. రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గానూ నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్, హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలోని రెండు ఆసుపత్రులకు నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్ కేర్‌ ప్రొవైడర్‌(NABH) అక్రిడిటేషన్‌ లభించింది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (QCI)లో NABH ఓ విభాగం. దేశంలోని ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్స్, రక్తదాన కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రులు, వివిధ స్థాయిల్లో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యతా ప్రమాణాలను బట్టి గుర్తింపు ఇస్తుంది. 

సుమారు 10 చాప్టర్లు, 100 ప్రమాణాలు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో పనిచేస్తుంది. ఆసుపత్రులు ఈ అక్రిడేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. కేంద్రం ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి, ఆసుపత్రులు స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్ (SOP)కి అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించిన తర్వాత, వాటికి అక్రిడిటేషన్‌ మంజూరు చేయడం జరుగుతుంది. అక్రిడిటేషన్‌ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది. 

NABH అంటే  ఏంటి?
NABH ధ్రువీకరణ పొందాలంటే ఆసుపత్రులు ముఖ్యంగా ఎనిమిది విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ ప్రమాణాలన్నింటిని విశాఖపట్నంలోని రెండు ఆస్పత్రులు అందుకున్నాయి. సర్వీస్‌ ప్రొవిజన్‌, రోగుల హక్కులు, ఇన్‌పుట్స్, సహాయక సేవలు, క్లినికల్‌ కేర్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, నాణ్యమైన ఆరోగ్య సేవల నిర్వహణ, రోగి భద్రత ఈ విభాగాల్లో సంపూర్ణమైన ప్రమాణాలు పాటిస్తున్నాయి. వీటిని పరిశీలించిన బోర్డు రెండు ఆస్పత్రులకు అక్రిడిటేషన్‌ మంజూరు చేసింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు రాష్ట్రంలోని అన్ని టీచింగ్‌ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, PHC, UPHC, CHS, VHCలలో సైతం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS) ఉండేలా  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

రాష్ట్రంలో చేపట్టిన నేషనల్ హెల్త్ మిషన్
ప్రజలకు ఆరోగ్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్‌ పలుమార్లు నిర్దేశించారు. ఇందుకోసం నేషనల్‌ హెల్త్ మిషన్‌ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హెల్త్‌ కేర్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 537 ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులు NQAS ప్రమాణాలను అందుకున్నాయి. 2023-24 సంవత్సరానికి 2,956 కేంద్రాలను ఈ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 

మరిన్ని లక్ష్యాలు
ప్రసవ సమయంలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం, ప్రసవానంతర సంరక్షణ, ప్రసవ సమయంలో సమస్యల తీవ్రతను తగ్గించడం, ప్రజారోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణులకు గౌరవ ప్రదమైన ప్రసూతి సంరక్షణ అందించడం ఇందులో మరొక ప్రధానమైన అంశం. ప్రసూతి మరణాల రేటును పూర్తిస్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా NQAS పనిచేస్తుంది. 2022-23  సంవత్సరంలో దేశవ్యాప్తంగా ధ్రువీకరించబడిన జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS) సాధించిన ఆరోగ్యం కేంద్రాలు  2041 అయితే, ఇందులో 452 ఆరోగ్యకేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా NQAS ప్రమాణాలు సాధించిన ఆరోగ్యకేంద్రాల్లో 18% ఏపీలోనే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన మూడున్నర నెలల్లోనే 170 ఆరోగ్యంకేంద్రాలను NQAS ధ్రువీకరణ కోసం పంపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget