By: ABP Desam | Updated at : 18 May 2023 03:41 PM (IST)
కొడాలి నాని వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి
Kodali Vs Vishnu : బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నాని భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అభివృద్ధి, వైసీపీ పరిపాలనా వైఫల్యాలు అన్నింటిపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే ప్రజా చార్జిషీట్‌పై చర్చిద్దామని సవాల్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చాను - ఆ వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అజేయకల్లాం !
ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటైనా పూర్తి చేశారో లేదో చూపించాలని విష్ణు సవాల్
మాజీమంత్రి కొడాలి నాని ఒక్కరే వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా తాును రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా..? అంటూ సవాల్ చేశారు.. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయట పెట్టాలన్నారు.
అమరావతిలోని ఆర్-5 జోన్ హౌసింగ్‌పై సీఎం సమీక్ష, 26న పట్టాల పంపిణీ!
నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతున్న బీజేపీ
2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ.. ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ సెటైర్లు వేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు.. మరోవైపు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు.. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు.
సునీల్ ధియోధర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
శుక్రవారం గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది.. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని.. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్‌పై కొడాలి నాని ఎలా స్పందిస్తారోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గుడివాడలో సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయని అక్కడి ప్రజలు ప్రజా చార్జిషీట్‌లో భాగంగా బీజేపీ నేతలకు ఫిర్యాదులు ఇచ్చారు. వాటిపై సునీల్ ధియోధర్ మాట్లాడితే.. కొడాలి నాని అనుచితంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!