అన్వేషించండి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనుపై జగన్ వేటు - టెక్కలి ఇంఛార్జి పదవి అవుట్

Duvvada Srinivas News: దువ్వాడ శ్రీను పర్సనల్ లైఫ్ రోడ్డెక్కడం.. ఆయన భార్య, పిల్లల నుంచే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.

YSRCP News: వైఎస్ఆర్ సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు పడింది. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనును  ఆ పదవి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలగించారు. దువ్వాడ శ్రీను స్థానంలో టెక్కలి ఇంఛార్జిగా పేరాడ తిలక్‌ను జగన్ నియమించారు. గతంలోనూ పేరాడ తిలక్ టెక్కలి వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 

దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం రోడ్డెక్కడం.. ఆయన భార్య, పిల్లల నుంచే ఆరోపణలు ఎదుర్కోవడంతో దువ్వాడ కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగినట్లుగా భావిస్తున్నారు. దువ్వాడ శ్రీను భార్యా పిల్లలతో సొంతింట్లో ఉండకుండా.. పరాయి మహిళతో మరో ఇంట్లో ఉండడం అనేక విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్ఠానం చాలా రోజులు ఆచితూచి చూసి.. ఇప్పుడు కఠిన చర్య తీసుకుంది. దువ్వాడకు ఆ పదవి పోతుందని ముందే అందరూ ఊహించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనును టెక్కలి ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు.

గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి

2024 ఎన్నికలలో టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేశారు. కానీ, ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో వీరు ఇద్దరూ గెలవలేకపోయారు. అలా ప్రస్తుతం టెక్కలి ఇంఛార్జిగా ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ కొనసాగుతున్నారు.

ఇంతలో ఆగస్టు 9 నుంచి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ రోజు రాత్రి దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు తన తండ్రిపై ఆరోపణలు చేస్తూ ఓ ఇంటి ముందు నిరసనకు దిగారు. టెక్కలి అక్కవరంలోని ఆ ఇంట్లోనే దువ్వాడ శ్రీను మరో వైఎస్ఆర్ సీపీ మహిళా నాయకురాలు దివ్వల మాధురి అనే ఆవిడతో కలిసి ఉంటున్నారు. ఇలా దువ్వాడ శ్రీనివాస్ - వాణి దంపతుల మధ్య నెలకొన్న వివాదం రోడ్డెక్కింది. దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసి ఉంటున్న ఇంటి ఎదుట వాణి రోజుల తరబడి ఆందోళనకి దిగడం.. తన భర్తపై వాణి తీవ్రమైన ఆరోపణలు చేయడం చేసేవారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి ఆ ఆరోపణలను ఖండిస్తూ.. ఒకరికొకరు మద్దతుగా నిలుచుకోవడం లాంటి ఘటనలతో పార్టీ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నది. 

ఎప్పటి నుంచో ఊహాగానాలు
ఈ వివాదం టెక్కలికే పరిమితం అయినప్పటికీ పార్టీకి నష్టం జరగడం మాత్రం రాష్ట్రమంతా ఉంటోంది. దీంతో అధిష్ఠానం ఇప్పుడు టెక్కలిపై దృష్టి పెట్టింది. ఇంఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి పేరాడ తిలక్ కు అవకాశం ఇచ్చింది. దువ్వాడ వివాదం ఆయన వ్యక్తిగతం అని లైట్ తీసుకోవడానికి లేదు. భవిష్యత్తులో దువ్వాడ ప్రజల మధ్యకి వెళ్తే.. ప్రజలు ఆదరించే అవకాశం లేదు. ఈ వివాదాల వ్యవహారం పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని అధిష్ఠానం కూడా అభిప్రాయపడింది. అందులో భాగంగానే అందరి ఊహాగానాలకు తగ్గట్లుగానే దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఇంఛార్జిగా తప్పించి.. పేరాడ తిలక్ ను నియమించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Ekta Diwas 2024: ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Ekta Diwas 2024: ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Amaran Movie Review - అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
Diwali Wishes: దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
Revanth Chit Chat Politics : చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
AP Deputy CM Pawan Kalyan: పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి- ఆసక్తికరమైన ట్వీట్ చేసిన పవన్
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి- ఆసక్తికరమైన ట్వీట్ చేసిన పవన్
Embed widget