Vizianagaram: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్, ఏకంగా రూ.460 కోట్లతో నెరవేరబోతున్న కల!
Vizianagaram News: ఉత్తరాంధ్ర వాసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 460 కోట్ల రూపాయలతో విజయనగరం, టిట్లఘర్ మధ్య రైల్వే మూడో లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Vizianagaram News: ఉత్తరాంధ్ర వాసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విజయనగరం, టిట్లఘర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే మూడో లైన్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 460 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆర్వీఎస్ఎల్ సహాయ జనరల్ మేనేజర్ సీహెచ్ విష్ణు మార్తితో కలిసి సీతానగరం నుంచి కొమరాడ మండలం విక్రమపురం, కోటిపాం, పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ల వరకు పనులను పర్యవేక్షించారు. అయితే ఈ రైల్వే పనులను త్వరగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ముందుగా విక్రాంపురం వద్ద అండర్ గ్రౌండ్ పనులను పరిశీలించి.. అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటిపాం వద్ జంఝావతి నదిపై నిర్మించిన మూడో లైనుకు సంబంధించిన కొత్త వంతెనను పరిశీలించారు.
మూడో లైన్ వల్ల ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చే అవకాశం..
ఈ సందర్భంగా రైల్వే అధికారులతో మాట్లాడుతూ.. రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైల్వే మూడో లైనుకు సంబంధించిన భూ సేకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 44 కిలో మీటర్ల మేర మూడో లైన్ వస్తుందన్నారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎలివేషన్ స్థానిక సాంస్కృతిక, సంప్రదాయ పరిగణలోకి తీసుకొని చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మూడో లైన్ వల్ల మరికొన్ని పాసింజర్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చే అకాశం ఉంటుందని వివరించారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు తొలుగుతాయని చెప్పారు. సీతానగరం రైల్వే స్టేషన్ పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఎలివేషన్ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్నాయని వెల్లడించారు.
మూడు మేజర్, 135 మైనర్ బ్రిడ్జిలు నిర్మించాలి..
విజయనగరం - టిట్లఘర్ మధ్య 256 కిలో మీటర్ల మేర లైన్ కు 2335.68 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని ఆర్వీఎస్ఎల్ సహాయ జనరల్ మేనేజర్ విష్ణుమూర్తి తెలిపారు. ఇందులో మూడు మేజర్ బ్రిడ్జిలు, ఆరు ఆర్యూబీలు, 135 మైనర్ బ్రిడ్దిలు నిర్మించాల్సి ఉందన్నారు. జిల్లాలో కూనేరు నుంచి సతానగరం వరకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పార్వతీపురంలో అదనపు కాలినడక వంతెన, బుకింగ్ కార్యాలయం, కూనేరు, గుమడ, పార్వతీపురం, సీతానగరంలో మెరుగైన సౌకర్యాలతో కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. వారి వెంట రైల్వే సీనియర్ డీజీఎం ఈవీ గురునాథ రావు, తహసీల్దార్లు, రైల్వే సిబ్బంది ఉన్నారు.