అన్వేషించండి

Vizag Man Collecting Vintage Bikes: 1953 నుంచి లేటెస్ట్‌ టూవీలర్‌ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ

Vizag News: వింటేజ్‌ వాహనాలు ఈ మధ్య కాలంలో క్రేజ్‌ బాగా పెరిగింది. ఇలాంటి వెహికల్స్‌ను కలెక్ట్‌ చేస్తూ ఆందర్నీ ఆకర్షిస్తున్నారు విశాఖకు చెందిన వ్యక్తి.

Vintage Bike Collections In Vizag Man: ఏడు దశాబ్దాల కిందట ద్విచక్రవాహనాలు ఏలా ఉండేవి? ఎంత వేగంతో నడిచేవి? వాటి సామర్థ్యం ఎంత? ఇవన్నీ ఇప్పటి తరానికి తెలియవు. వాటి గురించి ప్రత్యక్షంగా తెలుసు కోవాలంటే విశాఖ నగరం రెడ్డి కంచరపాలేనికి చెందిన బసవ రవిశంకర్రెడ్డి ఇంటికి వెళ్లాల్సిందే. వృత్తిరీత్యా ఇంజినీరు అయిన ఆయనకు పాత ద్విచక్రవాహనాల సేకరణ అంటే ఆసక్తి. 1957నాటి జావా బైక్, 1963వాటి ల్యాంబ్రీట స్కూటర్, రాజ్ దూత్, డీజిల్ బుల్లెట్, లూనా, ఇండ్-సుజికీ బైక్లు.. ఇలా సుమారు 31 పాత ద్విచక్రవాహనాలు ఆ వద్ద ఉన్నాయి. వీటిని భద్రపర్చడానికి ఏకంగా ఇంటినే తీర్చిదిద్దారు రవిశకంర్.

ఇంటి చుట్టూ తిరిగిన డైరెక్టర్లు

వాహనాలు తుప్పు పట్టిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రవిశంకర్రెడ్డి. ధ్రువపత్రాలనూ అప్‌డేట్ చేస్తున్నారు. దీని కోసం ఏటా సుమారు రూ.1.70 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. తండ్రి ఒక బైక్ రైడర్‌గా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన గుర్తుగా వాహనాలను ఉంచారు. బైక్స్ సేకరించి దానికి అన్ని రకాల పర్మిట్లతో రోడ్డు మీద తిప్పుతూ ఉన్నారు. ఇంకా రవిశంకర్రెడ్డి ఏమన్నారంటే..." నాకెంతో మంది సినిమా వాళ్లు బైక్స్ కావాలని అడిగారు ఇష్టం లేక ఇవ్వట్లేదు. ఇండస్ట్రీ వాళ్ళు ఇంటి చుట్టూ బైకులు చుట్టూ తిరిగారు. నేను అంగీకరించకపోవడంతో ఫీల్ అయ్యి వెళ్లిపోయేవాళ్లు." అని చెబుతున్నారు. 

Vizag Man Collecting Vintage Bikes: 1953 నుంచి లేటెస్ట్‌ టూవీలర్‌ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ

1957 నాటి నుంచి నేటి వరకు

1957 నాటి జావా బైక్, 1963 నాటి ల్యాంబ్రీటా స్కూటర్, 1979 డీజీల్ బుల్లెట్ రవిశంకర్రెడ్డి వద్ద ఉంది. అవన్నీ ఏడు దశాబ్ధాల వెనక్కి తీసుకుపోయే వింటేజ్ వాహనాలే. స్పెషలైజేషన్ బైక్స్ మాత్రం కలెక్ట్ చేస్తారు. వింటేజ్ నుంచి బైక్స్ ఎవల్యూషన్ సిరీస్ వాహనాలే సేకరిస్తున్నారు. 

31 వింటేజ్‌ బైక్‌లు 

రవి శంకర్‌ వద్ద 31 బైక్స్ ఉన్నాయి. 1957 నుంచి 2019 లాస్ట్ మోడల్, అల్ సీరిస్ ఆఫ్ వెహికిల్స్ ఉన్నాయి. ఇందులో 5 వెహికల్స్‌ అప్ డేట్ అవ్వలేదు. సీ బుక్స్ సహా ఇతర డాక్యుమెంట్స్ లేక అప్ డేట్ కాలేదు. మిగతా 27 వెహికిల్స్‌కు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫుల్‌ రన్నింగ్‌ కండిషన్‌లో ఉన్నాయి. 

2300 రూపాయల మోఫా బైక్‌ లక్షన్నర

వీటిపై అప్పుడప్పుడు సరదాగా వెళ్తుంటారు రవిశంకర్. బైక్స్ కోసం ప్రత్యేకంగా ఓ బిల్డింగ్ కట్టారు. ఇది కేవలం బైక్స్ పార్కింగ్ కోసం వాటి నిర్వహణ కోసం ఉంచారు. వింటేజ్ బైక్స్ కలెక్షన్ చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. ఇటీవల సినిమాల్లో వింటేజ్ బైక్స్ వాడకంతో వీటికి క్రేజ్ పెరిగిందన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా వాహనాలను షూటింగులకు ఇవ్వలేదని చెప్పారు. 2300 రూపాయలు విలువ చేసే మోఫా బైక్‌ క్రేజ్‌ రఘవరన్ బీటెక్ మూవీతో పెరిగిందన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత ఓఎల్ఎక్స్‌లో మోఫా బైక్ లక్షన్నర వరకు వెళ్లిందట. 

Vizag Man Collecting Vintage Bikes: 1953 నుంచి లేటెస్ట్‌ టూవీలర్‌ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ

నీళ్లతో కడగొద్దు

వింటేజ్ వాహనాలను నిర్వహణ కష్టమని ఏ తప్పు చేసినా తుక్కుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు రవిశకంర్. నీటితో అసలు కడగొద్దని చెబుతున్నారు. డీడస్టింగ్ చేయడమే ఉత్తమమని చెబుతారు. కాదనుకుంటే తడి గుడ్డతో తుడిచేయాలని చెబుతున్నారు. రస్ట్ అనిపిస్తే ఏదో పెయింట్ వేసేయాలి అంటున్నారు. వీటి విడిభాగాలు యూకే, లండన్ నుంచి ఆర్డర్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. 

గత 70 ఏళ్లుగా ఇండియా మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ ప్రత్యేకమైన బైక్ తన వద్ద ఉందని, వాటిలోని కొన్ని బైక్స్ ప్రత్యేకతలు వివరించారు. "రాజ్దూత్ అని ఇండియన్ ఆఫ్ రోడ్ కింగ్ అంటారు. అది పొలాల్లో కూడా ట్రావెల్ చేయడానికి అనువుగా ఉంటుంది. మాములు వెహికల్స్ అలా చేయలేవు. 

నా దగ్గర హోండా స్ట్రీక్ బైక్ ఉంది. దానికి స్పెషల్ గేర్ బాక్స్ ఉంటుంది. నార్మల్‌గా గేర్ బాక్సులన్ని 1, 2, 3, 4 వేసి మళ్లీ బ్యాకే రావాలి. బట్ దానికి బాల్ పెన్ టైప్ గేర్స్ వేయాలి. దీన్ని రోటరీ గేర్స్ అంటారు. మీరు ఫోర్త్ వేసిన తర్వాత మళ్లీ ముందుకే వెళ్లొచ్చు. వెనక్కి రావాల్సిన అవసరం లేదు. మళ్లీ జీరో అయి మళ్లీ ముందుకు వెళ్లిపోతారు. వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్తూనే ఉంటారు. 1, 2, 3, 4...0...మళ్లీ 1, 2, 3,4 ఇలా అన్నమాట. 

Also Read: అరుణాచలం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఖర్చులో వెళ్లాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్, పూర్తి డిటైల్స్ ఇవే

1958 జావా స్పెషాలిటీ ఏంటంటే...కిక్ స్టార్ట్, గేర్ ఒకే దాంట్లో ఉంటాయి. దాన్ని అలా డిజైన్ చేశారు. చెకోస్లోవేకియా డిజైన్ అది. 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వెళ్లొచ్చండీ. ఆ బైక్ కీ స్టెప్నీ వీల్ కూడా మెయింటైన్ చేయవచ్చు."అని బైక్‌ల కోసం వివరించారు. 

Vizag Man Collecting Vintage Bikes: 1953 నుంచి లేటెస్ట్‌ టూవీలర్‌ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ

హాబీగా బైక్‌ల కలెక్షన్

రవిశంకర్ ఇంటి బయట, ఇంటి లోపల, మేడపైనా, అటకలపైనా...హాలులో, బాల్కనీలో ఎక్కడ చూసినా వింటేజ్ వాహనాలే కనిపిస్తాయి. ఎందుకు సేకరిస్తున్నారని అడిగితే..." స్టార్టింగ్ వెహికల్స్ నుంచి లేటెస్ట్ సిరీస్ వరకు వింటేజ్ వెహికల్స్ ఏవో యంగ్ జనరేషన్స్‌కు తెలియాలి. ఇండియన్ వెహికల్స్ ఏవో కూడా తెలియాలి. మ్యూజియం స్టాండర్డ్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను. డాక్యుమెంట్స్ అప్‌డేట్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాను. అప్‌డేట్ చేయలేమని గవర్నమెంట్ చెబితే మ్యూజియం స్టాండర్డ్‌కి వెళ్లిపోతా. అది ఎక్కడో స్టాండ్ చేసి వదిలేస్తాను. అంత వరకు అప్‌డేట్‌ చేస్తూనే ఉంటాను. ఇదొక హాబీ." అని చెప్పుకొచ్చారు.  

నాన్నకు గుర్తుగా

నాన్న గుర్తుగా ఎన్నో వాహనాలను ఇలా కలెక్ట్ చేసుకునే క్రమంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్టు రవి శంకర్ చెప్పారు. కొంతమంది పాత వాహనాలు కొని స్క్రాప్‌లో అమ్ముకుంటావని హేళన చేశారన్నారు.  డబ్బులు క్యాష్‌ చేసుకోవడానికి ఇలా చేస్తావు అని కామెంట్స్ చేశారని అన్నారు. అయినా బాధపడలేదని కలెక్ట్ చేసి ఉంచుకునే ఆనందం వేరేగా ఉంటుందన్నారు. "మా నాన్న ఒక బైక్ రైడర్. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు ఇన్ని వాహనాలను సమకూర్చాను. ఎవరు ఏమనుకున్నా సరే పట్టించుకునే వాడిని కాదు. నేటి తరం వారికి ఈ బైక్స్ గురించి తెలియదు. దీన్ని రిపేర్ చేసే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. అందుకని ఒక సివిల్ ఇంజనీర్‌గా దాన్ని ఎలా రిపేర్ చేయాలని దానిపై నేనే రీసెర్చ్ చేస్తుంటాను. అని చెప్పుకొచ్చారు రవి శంకర్.

Also Read: ఒకరితో మొదలై వంద మంది మహిళలకు ఉపాధి- ఆదర్శంగా శ్రీకాకుళం జిల్లాలోని సీతానగరం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Embed widget