అన్వేషించండి
Advertisement
Cash Seized in Vizag: ఎన్నికల వేళ విశాఖలో నోట్ల కట్టల కలకలం, కారు వదిలేసి నిందితులు పరార్
Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ నోట్ల కట్టలు లభ్యమవుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో కోటిన్నర పైగా నగదు అధికారులు స్వాధీనం చేసుకన్నారు.
విశాఖపట్నం: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో పలుచోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో కోటి పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద దాదాపు కోటిన్నర నగదు లభ్యమైంది. సీ విజిల్ యాప్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ కారులో వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వెంటనే వాహనం నిలిపివేశారు. అంతలోనే నిందితులు కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించిన అధికారులు భారీగా నగదు కనిపించడంతో షాకయ్యారు. ఆ నగదు ఒకటిన్నర కోట్ల రూపాయాలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగదు ఎక్కడికి తరలిస్తున్నారు, ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నారా, ఈ డబ్బు ఎవరికి అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion