By: ABP Desam | Updated at : 19 Apr 2023 06:26 PM (IST)
వైఎస్ భారతి కనుసన్నల్లోనే విశాఖ భూదందాలు - టీడీపీ నేత బండారు ఆరోపణ !
Vizag News : విశాఖలో వైఎస్ భారతి కనుసన్నల్లోనే భూదందాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు . విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. విశాఖలో రామానాయుడు స్టూడియో కి గతంలో ఇచ్చిన స్ధలాన్ని రియల్ ఎస్టేట్ గా మారుస్తున్నారని ఆరోపించారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఇచ్చిన స్ధలమది చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడకోసం మాత్రమే 33 ఎకరాలను నామ మాత్రంగా కేటాయించారని.. హైరైజ్ టవర్స్ కట్టేందుకు ఎలా అనుమతి ఇచ్చారో అధికారులు చెప్పాలి అని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.-
ఇచ్చిన అనుమతలతో సంబంధం లేకుండా సీఆర్‌జెడ్ రూల్స్‌కు వ్యతిరేకంగా భారీ విల్లాలు కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ్మండిపడ్డారు. నిర్మాణాలు చట్టవిరుద్దంగా కట్టడమే కాకుండా చట్ట విరుద్దంగా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని.. బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేయబోతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు. రామానాయుడు స్టూడియోస్ లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదని మంత్రి అమర్ నాధే చెప్పారు అని బండారు సత్యనారాయణ మూర్తి గుర్తు చేశారు. వైఎస్ భారతి కనుసన్నలో భూదందాలు జరుగుతున్నాయన్నారు.
విశాఖలో కేంద్ర పర్యావరణ అటవీ నిబంధనలకు విరుద్దంగా ఏమి జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. ఏ రకంగా భూమార్పిడి చేశారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని బండారు డిమాండ్ చేశారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన 33 ఎకారాల్లో 17 ఎకరాలకు కమిషనర్ ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలన్నారు. గజం 60 వేల చొప్పున అమ్మకానికి పెడుతున్నారని తెలిసిందని.. తెలంగాణ లో వున్న ఓ నిర్మాత ఇటు జగన్మోహన్ రెడ్డి కి సురేష్ ప్రొడక్షన్స్ కు మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. లే అవుట్ డవలప్ అయ్యాక , విల్లాలు వచ్చాక బినామీ రిజిస్ట్రేషన్ లు చేయబోతున్నారు అని ఆరోపించారు. కన్సర్వేటర్ లో వున్న ప్లాన్ ను మిక్సడ్ జోన్ లోకి మార్చేశారని ఇది చట్ట విరుద్ధమన్నారు.
విశాఖలో బీచ్ రోడ్ లో కొండపై రామానాయుడు స్టూడియో ఉంది. గతంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి ఆ స్థలాన్ని తీసుకుని స్యూడియో నిర్మించారు. అయితే ఆ స్థలంలో ఖాళీగా ఉందని 17 ఎకరాలకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. సాధారణంగా అనుమతులు రాని ప్రదేశం కావడంతో అనుమతులు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై దుమారం రేగుతోంది. ఇదంతాపెద్దల కనుసన్నల్లో జరిగిన దోపిడి అని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!