Venugopala Swamy Temple: పెళ్లి కావలసిన వాళ్లు వస్తే సంవత్సరంలో పెళ్లి అవుతుంది, కోరిన కోరికలు నెరవేర్చే స్వామి
Srikakulam | మీకు ఇల్లు లేదా అయితే శ్రీకాకుళం వేణుగోపాల స్వామి దేవాలయం కొండమీద మూడు రాళ్లు పెడితే చాలు సంవత్సరం తిరిగే లోపల మీ ఇల్లు కడతారు. పెళ్లి కావలసిన వాళ్లు వస్తే సంవత్సరంలో పెళ్లి అవుతుంది.

Unknown Facts about Srikakulam Venugopala Swamy Temple | పిల్లలు లేనివారు శ్రీకాకుం జిల్లాలో వేణుగోపాలస్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ ప్రాంగణంలో వ్రతం చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే సంతాన వేణుగోపాలుడిగా కీర్తించే స్వామి సన్నిధికి ఆరోజు మహిళలు ఎక్కువగా వస్తుంటారు. అలాగే దాసురాళ్లు, దాసుళ్లు తరలివచ్చి స్వామికి పూజలు చేసి విభూతి ఉండలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తారు.
శాలిహుండం యాత్ర తర్వాతే ఇంటి దగ్గర సంబరాలు చేసుకోవడం చాలా మందికి పరిపాటి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త మధురెడ్డి తెలిపారు. స్వామిని భక్తులు సులువుగా దర్శించుకొనేందుకు వీలుగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో లడ్డూలను తయారుచేస్తున్నారు. క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు.
7న సాయంత్రం పరిసర గ్రామాల్లో తిరువీధి, అర్ధరాత్రి స్వామికి క్షీరాభిషేకం, అలంకరణ, దర్శనాలకు అనుమతి ఇస్తారు. 8న జాతరతో పాటు ఉదయం వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులను వేర్వేరుగా పల్లకీల్లో ఊరేగించి.. వంశధార నదిలో సంప్రదాయబద్ధంగా చక్రతీర్థ స్నానాలు చేయిస్తారు. 9, 10, 11న ప్రత్యేక పూజలు, స్వామి దర్శనాలు 12న ఆలయంలో తిరు కల్యాణం నిర్వహించనున్నారు

గారమండలంలోని శాలిహుండం శ్వేతగిరిపై వెలసిన కాళీయ మర్దన వేణుగోపాలస్వామి యాత్ర... శు క్రవారం సాయంత్రం పరిసర గ్రామాల్లో స్వామి తిరువీధి ఉత్సవంతో యాత్ర ప్రారంభమై 12వ తేదీన తిరుక్కల్యాణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నుంచి 5 రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తారు.


ఈ యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ మేరకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు సిద్ధం చేశారు. వైద్యం, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. కొండపైకి వచ్చే భక్తులుతిరుగు ప్రయాణంలో వీర వసంతేశ్వరస్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస తదితర ప్రాంతాలు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.

వేణుగోపాలస్వామిని దర్శించుకొన్నవారు పొందిన ఫలితాలు
శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం గ్రామంలోని శ్వేతగిరిపై వెలిసిన కాళేయమర్ధన వేణుగోపాల స్వామి . ప్రతి యేటా భీష్మ ఏకదాశి రోజున జరిగే ఈ యాత్రకు ఉత్తరాంద్ర జిల్లాల్లో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దీంతో ఈ యాత్రకి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి భక్తి శ్రద్దలతో వేణుగోపాల స్వామిని దర్సించుకుని తరించారు. ప్రకృతి అందాల నడుమ వంశదార నది తీరంలో ఉన్న వేణుగోపాల స్వామికి ఉదయం తిరువీది నిర్వహించి వేదమంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ చక్రతీర్ఢ స్నానాలను నిర్వహించారు. లక్ష్మీనృసింహా స్వామి ఉత్సవ మూర్తులను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరువీధి నిర్వహించారు.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధంలో శాతవాహన రాజులు నిర్మించినటువంటి ఆలయం ఈ శ్వేతగిరి అని పురుణాలు ఘోషిస్తున్నాయి. స్వంత ఇళ్లు లేనివారికి ఇళ్లు కావాలంటే ఈ కొండపై ఉన్న కొండ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి స్వామి వారిని దర్శించుకుంటే తమకు అన్ని రకాలుగా ఇళ్లు కట్టుకొనే భాగ్యం కలిగిందని పలువురు మహిళలు సివిఆర్ తో తమ అనుభవాలు పంచుకున్నారు.

సంతానలేమితో భాదపడుతున్న వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాధించే సంతాన వేణుగోపాలనిగా స్వామిగా ఉత్తరాంధ్రాతోపాటు సమీప ఒడిషాలో ని గజపతి, గంజాం, రాయఘడ జిల్లాలకు చెందిన భక్తులు, ఛతీస్ ఘడ్ రాష్ట్రొం నుండి కూడా వేలాధిగా భక్తలు వచ్చి పూజలు చేయడం వల్ల ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. స్వామిని దర్సించుకుంటే సుఖ సంతోషాలతో జీవనం సాగించగలమన్నది భక్తుల నమ్మకం. అందుకే భీష్మ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు కాలి నడకన శ్వేతగిరిపైకి చేరుకుని వేణుగోపాలనుని దర్సించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ యాత్ర సందర్భంగా శాలిహుండం పరిసర ప్రాంతాలు భక్తజనులతో కిటకిటలాడాయి.





















