అన్వేషించండి

Visakha Tribal Area : వాళ్లకు వర్షాకాలమంతా సముద్రంలో ఉన్నట్లే - మన్యం జిల్లాలో ఆ గ్రామాల వారికి కష్టాల నుంచి విముక్తి ఎప్పుడో

Andhra Pradesh : మన్యం జిల్లాలో గిరిజన గ్రామాలు వర్షాకాలంలో అనేక కష్టాలు పడుతున్నాయి. వర్షాకాలం వస్తే వారు సముద్రంలోకి వెళ్లిన సెయిలర్లలాగా చుట్టూ నీటి ముంపులోనే గడపాల్సి వస్తోంది.

Tribal villages in Manyam district face many hardships during monsoons : మన్యం జిల్లా ఏజెన్సీ కొమరాడ 45 పంచాయతీలు 9 గ్రామాల ప్రజలకు ఆరు నెలల పాటు జనజీవనం స్తంభించిపోతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వారికి ఇంకా భయాందోళన మొదలైనట్టే . చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు. కనీసం నాలుగు నెలల పాటు ఆ గ్రామాలకి వెళ్లే పరిస్థితి ఉండదు. వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 

పూర్ణపాడు - లాబేసు గ్రామల మధ్య ఉన్న వారికి వర్షాకాల  గండం    

పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య ఉన్న నాగావళి నది తీరం నేటికీ ఆ గ్రామానికి సమస్యను అయితే తీర్చడం లేదు ఒడిస్సా క్యాచ్ మెంచ్  ఏరియాలో పడుతున్న వర్షాలకు వరద నీరు వచ్చిందంటే ఇక ఉన్న పడవ కూడా మూలకు చేరుకోవాల్సిందే. వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆ పడవను కూడా తీసే పని ఉండక అటు గ్రామ ప్రజలు ఇటువైపు వెళ్ళలేక నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఈ ఆరు నెలల పాటు వారు దిక్కుబిక్కుమంటూనే జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు కూడా హామీలకైతే మాత్రం పరిమితి ఇస్తున్నారు గాని మా సమస్య పట్టించుకోవట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క  పిల్లలకి స్కూలు లేక కాలేజీలు లేక ఉన్న స్కూలుకి ఉపాధ్యాయులు రాక చదువులకు దూరం అయిపోయారు.

పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు

1996 నుంచి బ్రిడ్జి నిర్మాణ హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు

1996  ఆగస్టు 31వ తారీఖున అదే గ్రామానికి చెందిన పడవ ప్రమాదంలో 33 మంది మృతి చెందారు అప్పట్లో ప్రభుత్వాలు బ్రిడ్జి నిర్మాణం చేస్తావని హామీ ఇచ్చాయి. మధ్యలోపనులు ప్రారంభించాయి. కానీ..  కొన్ని పనులు జరిగినప్పటికీ ఒక పిల్లర్ నిర్మాణం సమయంలో భారీగా వరద నీరు రావడంతో ఆ పిల్లర్ కాస్త బురదలో కొట్టుకొని వెళ్ళిపోవడంతో కాంట్రాక్టర్  బిల్లులు రాక ఎక్కడ మెటీరియల్స్ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. గతంలో కూడా ఎన్నికల అధికారులు ఈ వరద నీటిలోంచే అవతల గ్రామానికి చేరుకొని ఎలక్షన్స్ జరిపించారు. గత ప్రభుత్వంలో ఖచ్చితంగా   బ్రిడ్జి నిర్మాణం చేస్తామని మాటిచ్చారు కానీ నేటికీ ఒక ఇటుక పని కూడా అవ్వలేదని గ్రామస్తులు అసంతృప్తికి గురవుతున్నారు. 

తాడిప‌త్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డికి సీఐ క్షమాపణలు- రాజకీయ దుమారం రేపుతున్న ఘటన

వర్షాకాలం వస్తే కరెంట్ కష్టాలు కూడా !

కరెంటు లేక సరైన సమయంలో వైద్యమందక ఎంతోమంది చనిపోతున్నారు. అక్కడి ప్రజలు అంతా  చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు ఈ ఆరు నెలల పాటు వరద వస్తే సుమారు నాలుగు నెలల పాటు ఆ గ్రామం విడిచి ఎటు వెళ్లాలో తెలియక కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస కూడా వెళ్ళిపోయారు. గ్రామంలో పరిస్థితికారణంగా అక్కడి యువతీయువకులకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు. 30 ఏళ్లుగా నరకయాత్ర అనుభవిస్తున్నామని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా బాధలు తప్పడంలేదని అంటున్నారు.  గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే ముందు రోజు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.  వైద్యం అందక ఆ గ్రామాల్లో 12 మంది పైగా గర్భిణీ స్త్రీలు చనిపోయారు. పూర్ణపాడు - లాబేసు గ్రామాల మధ్య బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget