అన్వేషించండి

Vangalapudi Anitha: భయానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్- వంగలపూడి అనిత

Vangalapudi Anitha: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భయానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు.

Vangalapudi Anitha:  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. తాము ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు జనంలోకి వెళ్లకుండా తీవ్ర ఆంక్షలు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ జనాల్లోకి వెళ్లడానికి భయపడి పరదాల చాటున సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం సభల్లో నల్లరంగు, పసుపు రంగు కనపడకూడదని అంటున్నారని.. ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తన సభలకు బెదిరించి జన సమీకరణ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అది వైసీపీ కుట్రే!

తమ నాయకుడు చంద్రబాబు సభలో కందుకూరు ఘటన జరగడం దురదృష్టకరమని అనిత అన్నారు. అయితే గుంటూరులో జరిగినది మాత్రం వైసీపీ కుట్రలాగే కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని జీవో ఇచ్చిన మరుసటిరోజే.. సీఎం రాజమండ్రిలో ఇరుకు సందులో రోడ్ షో చేయవచ్చా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సలహాదారులు అర్ధంపర్ధం లేని సలహాలు ఇస్తున్నారని అన్నారు. 

అప్పుడు లేనిది ఇప్పుడెందుకు

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయారు. అప్పుడు మద్యం నిషేధించారా? కచ్చులూరులో బోటు ప్రమాదంలో ప్రయాణికులు మరణించారు. అప్పుడు పర్యటక ప్రయాణాలు నిలిపివేశారా? మరి ఒక సభలో ప్రమాద ఘటన జరిగిందని సభలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అంటే సీఎం జగన్ భయపడుతున్నారు. అందుకు కుప్పంలో జరిగిన పోలీస్ చర్యలే నిదర్శనం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభలు జరపడానికి, టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికే పోలీసులు పనిచేస్తున్నట్లుంది. అని అనిత వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి,  రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, కార్యదర్శి నక్క పద్మ తదితరులు పాల్గొన్నారు,

జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు

తెలుగుదేశం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటంతో జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో  జగన్ శకం ముగుస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అని ప్రశ్నించారు. పోలీసులు చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలి కానీ ఏ పార్టీకి కొమ్ము కాయొద్దని సూచించారు. కుప్పంలోకి ఎందుకు రానివ్వలేదో లేఖ ఇవ్వాలని పోలీసులను కోరారు. ఏ చట్టం ప్రకారం జీవో నెంబర్ 1 తీసుకువచ్చారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మినహాయించబడిందని 1946 సవరణలో దాని ప్రస్తావన లేదని గుర్తు చేశారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget