By: ABP Desam | Updated at : 22 Mar 2023 02:54 PM (IST)
స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పీఠం ముద్రించిన శోభకృత్ నామ సంవత్సర గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. రాజశ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. జ్యోతిప్రజ్వలనతో విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. అంతకుముందు పీఠం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం చేసారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ మూడేళ్ళుగా దేశాన్ని కాల సర్పదోషం వెంటాడిందని, ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని తెలిపారు. దీని ప్రభావంతో దేశానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
అయితే ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు అనుకూలంగా ఉన్నందున, కొంతమేర ఇబ్బందులు తొలగవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతాయని, సీఎం జాతకం దృష్ట్యా ఇబ్బంది ఉండదని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు అధికమై, మరణాలు సంభవిస్తాయని వివరించారు. అన్ని రాష్ట్రాల్లోను వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బలు చూడాల్సి వస్తుందని తెలిపారు. అమెరికా వంటి దేశాలు ప్రకృతి వైవరీత్యాలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. జూలై నుండి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు సహజంగా ఏర్పడతాయని చెప్పారు. బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ఉగాది వేడుకలను నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించడం విశాఖ శ్రీ శారదాపీఠం సంప్రదాయంగా పాటిస్తోందని అన్నారు. ఉగాది వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ ఫ్యాంటు, షర్టులో కనిపించే సీఎం నేడు ఉగాది సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా తెలుపు రంగు పంచె, తెలుపు చొక్కా, పైపంచె ధరించి కనిపించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నూతన పంచాగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాల సెట్టింగులను అక్కడ ఏర్పాటు చేశారు. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.
కప్పగంతు సోమయాజి పంచాంగ శ్రవణం
అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయని కప్పగంతు సుబ్బరామ సోమయాజి అన్నారు. ఉద్యోగులు, శ్రామికులు, రైతులకు, కార్మికులకు మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని, ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. పంచాంగ పఠనం అనంతరం కప్పగంతు సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సత్కరించారు.
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్