Tenth Student Brain Dead: టెన్త్ విద్యార్థికి బ్రెయిన్ డెడ్, అవయవాలు దానం చేసిన కుటుంబం - గ్రీన్ ఛానల్ ఏర్పాటు!
శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన పదవ తరగతి పరీక్షలు రాస్తూ విద్యార్థి కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవ దానం చేసేందుకు అతడి కుటుంబీకులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఔరా అనిపించుకుంటున్నారు.
Srikakulam Tenth Student Brain Dead: శ్రీకాకుళం జిల్లాలో అరుదైన ఆదర్శవంతమైన సంఘటన జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో అయిదుగురి ప్రాణాలనూ కాపాడిన వైనమిది. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన పదవ తరగతి పరీక్షలు రాస్తూ విద్యార్థి కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవ దానం చేసేందుకు అతడి కుటుంబీకులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఔరా అనిపించుకుంటున్నారు. జేమ్స్ ఆసుపత్రి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె, లివర్, కిడ్నీలు ముందు విశాఖకు తరలించారు. తిరుపతికి గుండె, విశాఖకు కిడ్నీ, లివర్ అవయవాలు. వెళ్లేందుకు వైద్యులు తగిన ఏర్పాట్లు చేశారు.
తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణదానం చేయడం జిల్లాలో తొలిసారి అని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా సోంపేట గీతామందిర్ కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్ రావు, గిరిజ కళ్యాణిల కుమారుడు కిరణ్ చంద్ (15) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదవ తరగతి పరీక్షలు రాస్తూ.. ఈ నెల 15న తేదీన ఆఖరి పరీక్ష నాడు బ్రైన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో కిరణ్ చంద్ అనే విద్యార్థిని చికిత్స కోసం జేమ్స్ మెడికల్ కాలేజీలో అతడి కుటుంబీకులు జాయిన్ చేశారు. అయినా వైద్యులు ఫలితం లేదన్నారు డాక్టర్లు.. బ్రెయిన్ డెట్ అయినట్లు గుర్తించారు. అతనిని రక్షించడానికి వైద్యులు కొన్ని రోజుల పాటుఎంతో శ్రమించారు. కానీ దురుదృష్టవశాస్తూ ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. చేసేదేమీ లేదని చెప్పడంతో తమ కుమారుడి ద్వారా మరికొందరి ప్రాణం నిలిపేందుకు కిరణ్ చంద్ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అవయవదానం చేయడానికి ఆ విద్యార్థి తల్లిదండ్రులు ముందుకొచ్చారు.
అవయవ దానం కోసం గ్రీన్ ఛానల్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అవయవ దానం కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు కిరణ్ చంద్ గుండె, లివర్, కిడ్నీలు తరలించారు. తిరుపతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి గుండె, విశాఖపట్నం లో మరికొందరికి కిడ్నీ, లివర్ లు తరలించారు. విశాఖ ఎయిర్ పోర్టు వరకూ ప్రత్యేక అంబులెన్స్ లో కిరణ్ చంద్ ఆర్గాన్స్ ను తరలించారు. ఈ అరుదైన ఘటనకు శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి వేదికయింది. ఆ తర్వాత అవయవ దానంపై ఆర్గాన్ డోనేషన్ సమన్వయ కర్తలు, మృతుడి కుటుంబ సభ్యులకు బంధువులకు, అవగాహన కల్పించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రుల అంగీకారంతో గుండె, కళ్లు, కిడ్నీలు, లివర్ దానం చేశారు.
ఐరుగురి జీవితాల్లో వెలుగులు
చనిపోతూ మరో ఐరుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ జీవన్‌ధాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ డైరెక్టర్ డా. రాంబాబు తెలిపారు. శ్రీకాకుళ జిల్లాలోనే ఇది మొట్టమెదటి అవయవదానం. ప్రతి ఒక్కరూ కూడా అవయదానం పట్ల అవగాహన పెంచుకోవాలని ఏపీ జీవన్ దాన్ ప్రకటనలో తెలిపింది.