అన్వేషించండి

Uddanam: కిడ్నీ వ్యాధి అడ్డుకట్టలో మరో ముందడుగు, కూటమి ప్రభుత్వ ఈ ప్రయోగం ఫలిస్తుందా?

Uddanam Kidney Issue: కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ ఆచార్యులు లెక్స్ వానీన్ పలాస కిడ్నీ ఆసుపత్రికి చేరుకుని ఆధ్యాయానికి అడుగులు వేశారు.

Srikakulam News: ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ వ్యాధి మూలాలను గుర్తించేందుకు మరో సారి అంతర్జాతీయ స్థాయి పరిశోధకులకు బాధ్యతలు అప్పగించింది. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ ఆచార్యులు లెక్స్ వానీన్ పలాస కిడ్నీ ఆసుపత్రికి చేరుకుని ఆధ్యాయానికి అడుగులు వేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శీరిష ఈ పరిశోధకుడుతో సమావేశమయ్యారు. ఆయన నిర్వహించాల్సిన పరిశోధనలపై చర్చించారు.

పరీక్షల కోసం ఖరీదైన ఎక్విప్ మెంట్

ఉద్దాన ప్రాంతంలో నీరు, మట్టి, ఇంట్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ధూళి, వినియోగిస్తున్న పురుగుమందులు వంటి వాటిపై లోతైన అధ్యయనం చేసేందుకు గాను స్థానిక సిబ్బందికి రెండు రోజులు పాటు శిక్షణ ఇచ్చారు. నీరు, మట్టి, దూళి తదితర వాటిని పరీక్షించేందుకు గాను దాదాపు కోటి రూపాయలు విలువ చేసే అవసరమైన పరికరాలు, కంటైనర్లను జీన్ కొలంబియా నుంచి తీసుకొచ్చారు. కేవలం తాగునీటిపైనే 15 రకాల పరీక్షలు నిర్వహించేందుకు తగినచర్యలు చేపడుతున్నారు. కొన్ని పరీక్షలు ఆయన తీసుకువచ్చిన యంత్రాలద్వార పరీక్షించాల్సి ఉండగా మరికొన్నింటిని వేరే చోట పరీక్షలు నిర్వాహించాల్సి వుందన్నారు. ఈ మేరకు కలెక్టర్ మరింత విశ్లేషాత్మకంగా
చర్చించారు.

కిడ్నీ వ్యాధి ప్రబలడానికి మూలాలను అధ్యయం చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దానం ప్రాంతంలో పర్యటించినఅనంతరం ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితులను ఆదుకునే ప్రక్రియకు ఉపక్రమించారు. ఈ మహమ్మారి ప్రబలడానికిగల కారణాలపై అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రనాయుడు వైద్య బృందాన్ని నియమించి అధ్యయానికి తగు ఆదేశాలుజారీ చేసిన వైద్య నిపుణులు మూలాలను గుర్తించలేకపోయారు. మూలాలను గుర్తించలేనప్పటికి తాగునీరు ప్రధాన కారణంగా అను మానించడంతో శుద్ధ జలాలుఅందించేందుకు టీడీపీ ప్రభుత్వం హాయాంలో బీజం పడింది. వైసీపీ ప్రభుత్వ హాయాంలో బాధితులను పెన్సన్ పెంపకం, పలాసలో ఆసుపత్రి నిర్మాణం, శుద్ధ జలాలు అందించేందుకు తదితర చర్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకున్నారు.

అసెంబ్లీలో

పలాస ఎమ్మెల్యే గౌతు శీరిష అసెంబ్లీ సమావేశాల సమయంలో మరల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పలాసలో కిడ్నీ ఆసుపత్రి నిర్మాణంచేసి వదిలేశారే తప్ప కిడ్నిబాధితులు, ఉద్దానప్రాంతవాసులు ఆశించిన ఫలితం అందలేదని వారి ముందుంచారు. కిడ్నీ వ్యాధి తీవ్రతపట్ల వారికి అవగాహన ఉండడంతో మరల క్షేత్ర స్థాయిలో కిడ్ని మూలలను గుర్తించేందుకు పరిశోధనలకు ఉపక్ర మించారు. ఈ నేపథ్యంలో కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ది గ్లో బల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో పరిశోధనలు నుంచి క్షేత్ర స్థాయిలో ప్రారంభమయ్యాయి. మొత్తం 5 రోజులు పాటు ఉద్దానంలోని కవిటి, వజ్రపుకొత్తూరు, మందస, పలాస, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాలోని కిడ్ని ప్రభావిత ప్రాంతాల్లో పరిశోధనలు నిర్విహించి కిడ్ని బాధితుల ఇళ్ల వద్ద మట్టి, ధూళీ సేకరించి గ్రామాల్లో తాగునీరు, పంటపొలాల్లో ఎరువుల వినియోగం తదితర అంశాలపై పర్యావరణ ఆచార్యులు లెక్స్ వాన్ జీన్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు శిక్షణ పొందిన జిల్లాలోని ఆ ప్రాంతానికి చెందిన వైద్య బృందం సేకరించనుంది. బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులతో ముఖాముఖి అయ్యారు. వారు ఎదుర్కోంటున్న సమస్యలు తదితర అంశాలపై జీన్ సేకరించి నమోదు చేసుకున్నారు. అమెరికానుంచి తీసుకువచ్చిన పరీక్ష కిట్లలో మట్టి, నీరు, దూళీని భద్ర పరుస్తున్నారు. గ్లోబల్ ఇనిస్ట్యూట్ వైద్యాధికారి డాక్టర్ బాలాజీ  పలాస మండలం నుంచి పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామన్నారు. 120 శ్యాంపిల్స్ సేకరించనున్నామన్నారు. కాగా  రంగోయి ప్రాంతంలో నమూనాలు సేకరించిన వారిలో డాకరట్ దీలీప్, ఫీల్డ్ సూపర్ వైజర్ ఎంవీ సత్యనారాయణ  ఉన్నారు.

మూలాలను గుర్తించడమే ప్రభుత్వ ఆశయం: ఎమ్మెల్యే శిరీష

ఉద్దానంలో కిడ్నీ మహామ్మారి ప్రబలడానికి గల కారణాలపై అధ్యాయనం చేసి శోధించడమే ప్రభుత్వ ఆశయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఇటివలే ఈ సమస్యపై సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లడంతో మరో సారి పరీక్షలకు ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2014-2019 మధ్యలో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి తాగునీరు అందివ్వడానికి యుద్ధ ప్రాతిపదికన అప్పట్లో చర్యలకు ఉపక్రమించామన్నారు. అనంతరం పట్టించుకోలేదని మరల కూటమి ప్రభుత్వ హాయాంలో సీఎం, డిప్యూటీ సీఎంలో దృష్టి సారించారన్నారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో పరిశోధనలు జరిపారని ఆసంస్థ మరల ఈ ప్రాంతంలో అధ్యాయనం చేస్తుందన్నారు. శుద్ధ జలాలతో కొంత వరకు ఈ వ్యాధిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆమె కోరారు. ఆఫ్ షోర్ ప్రాజెక్టు నుంచి పలాస పట్టణానికితాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రతిపాదన ఉన్నప్పటికి ముందస్తుగా జలజీవన్ మిషన్ ద్వారా శుద్ధజలాలు అందివ్వాలని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అనుకూలంగా స్పందించి ఆర్ డబ్ల్యుఎస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో భరత్, ఆర్బ్ల్యుఎస్ అధికారులు, వైద్యులు పాల్గోన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Embed widget