Srikakulam: ఫ్లైట్ కూలిపోయిందని జనం పరుగులు! అసలు విషయం తెలిసి అవాక్కైన ప్రజలు
Telugu News: తమ ఊరికి విమానం వచ్చిందంటూ గ్రామ ప్రజలు తెగ సంబరపడ్డారు. భారీగా అక్కడకు చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
AP News: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమ్మిడిజోలలో ఆర్ అండ్ బీ రోడ్డుపై విమానం కూలిపోయిందని చేసిన ప్రచారం కలవర పరిచింది. తీరా కొందరు అక్కడకం వెళ్లి చూసేసరి పొడవుగా ఉన్న పాత విమానం ఒకటి అందరికి కనిపించింది. ఇపుడు ఆ ప్రాంతంలో అదే హైలైట్ అయింది. లారీపై అతి పొడవైన పాత విమానం శ్రీకాకుళంలోని బత్తిలి మార్గంలో గల దిమ్మిడిజోల వద్ద కనిపించింది. దీన్ని ఓ పొడవాటి ట్రక్కుపై తరలిస్తున్నారు.
ఈ విషయం తెలియక దూరం నుంచి చూసిన కొందరు వ్యక్తులు విమానం కూలిపోయిందంటూ.. ఊళ్లో ప్రచారం మొదలుపెట్టారు. విమానం నిజంగానే కూలిపోయిందంటూ చాలా మంది ప్రచారం చేశారు. వెంటనే అందరూ ఆ ప్రాంతానికి చేరుకొని షాక్ అయ్యారు. ఇది కాలం చెల్లిన విమానం. కోల్‌కతా నుంచి చైన్నైకు తీసుకెళ్తున్నట్టు ట్రక్కు డ్రైవర్లు చెబుతున్నారు. 36 చక్రాల భారీ వాహనంపైన తీసుకెళ్తున్న ఈ ప్లైయిట్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు.
దిమ్మిడిజోల గ్రామానికి రోడ్డుపక్కనే ఈ విమానం కనిపించడంతో జనం ఎగబడి చూస్తున్నారు. కొంత మంది సెల్ఫీలు తీసుకుంటుండగా మరికొందరు విమానం పైకి వెళ్లి లోపలలకు వెళ్లే మార్గం ద్వారా ప్రవేశించారు. విమానంలో ప్రయాణం చేసినట్టు ఫీలవుతున్నారు. ఇంకొంత మంది తమవారికి వీడియో కాల్స్ చేశారు. చాలాసేపు ఆ విమానాన్ని ట్రక్కు డ్రైవర్లు అక్కడే ఆపేసి ఉంచడంతో భారీగా జనం వచ్చారు. దీంతో అది ప్రదర్శనకు నిలిపినట్టుగా మారింది. చిన్నారులు, పెద్దలు, మహిళలు భారీగా అక్కడకు చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. తమ ఊరికి విమానం వచ్చిందంటూ ప్రజలు తెగ సంబరపడ్డారు.