అన్వేషించండి

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్, అధికారులు షాక్ - అసలు ట్విస్ట్ తెలిసి డీలా!

ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీని లెక్కించే ఆ దేవస్థానం అధికారులకు కనిపించిన ఓ చెక్ ఆనందం, భావోద్వేగంతో పాటు షాక్ కు కూడా గురి చేసింది.

లక్షా, కోటి కాదు.. ఏకంగా 100 కోట్ల చెక్‌ను విశాఖ సింహాద్రి అప్పన్న హుండీలో వేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఆ చెక్ చూసి అధికారులు స్టన్ అయ్యారు. వివరాలు చూడగా.. ఆ చెక్ బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి పేరు మీద ఉంది. అయితే, సేవింగ్స్ ఖాతా నుంచి 100 కోట్ల దానం ఇవ్వడంపై ఆలయ అధికారులకు డౌట్ వచ్చింది. దాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి చెక్ చేయగా.. అస్సలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఏకంగా 100 కోట్లకు చెక్‌ హుండీలో వేసి ఆ భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయ సిబ్బంది ఖంగుతిన్నారు. ఇవాళ బ్యాంక్‌కు అధికారికంగా చెక్ పంపి లిఖిత పూర్వకంగా.. అన్ని వివరాలు తీసుకోనున్నారు టెంపుల్ అధికారులు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్‌ వేసి ఉంటే.. చర్యలు తప్పవన్నారు అధికారులు.

ఎప్పటిలానే ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీని లెక్కించే ఆ దేవస్థానం అధికారులకు కనిపించిన ఓ చెక్ ఆనందం, భావోద్వేగంతో పాటు షాక్ కు కూడా గురి చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల చెక్ కళ్లముందు సాక్షాత్కారం అవగానే పరాకామణి సిబ్బంది బిత్తర పోయారు. షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత ఉన్నతాధికారులకు తెలియచేశారు. దాంతో ఇప్పటివరకు వందల సంవత్సరాల దేవస్థాన చరిత్రలో ఎన్నడూ జరగని ఆ వింత పై తొలుత ఉన్నతాధికారులు కూడా అనుమానించలేదు సరికదా ఆ భక్తుడు ఎవరూ తెలుసుకుని స్వయంగా కలిసి ఆహ్వానించి మరోసారి దేవాలయ మర్యాదలతో దర్శనాన్ని కూడా చేయించాలని ప్రణాళికలు వేయడం ప్రారంభించారు.

సేవింగ్స్ అకౌంట్ లో 100 కోట్లా ఆన్న అనుమానం
షాక్ నుంచి తేరుకున్న కాసేపటికి అసలు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దానిపై ఉన్న వివరాలను బట్టి బొడ్డేపల్లి రాధాకృష్ణ కు చెందిన సేవింగ్స్ అకౌంట్ గా గుర్తించారు. ఎంవీపీ డబుల్ రోడ్డు బ్రాంచ్ పేరుతో చెక్ నెంబర్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ నుంచి 100 కోట్ల విరాళం ఇవ్వడంపై టెంపుల్ అధికారులకు అనుమానం వచ్చింది. అందులోనూ చెక్ పై వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానం పేరుతో రాసిన ఆ చెక్ పై మొదట 10 రూపాయలు అని రాసి కొట్టేసి మళ్లీ 100 కోట్లు అని రాసి ఉన్నట్టు గుర్తించాక అందరిలో ఉత్సుకత తో పాటు అనుమానం కూడా కలిగింది.

అకౌంట్ లో 17 రూపాయలే
హుండీ లో 100 కోట్ల చెక్ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు మీడియా దృష్టికి వచ్చింది. వెంటనే బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించారు కొందరు మీడియా ప్రతినిధులు. అక్కడ ఇంకోసారి షాక్ కు గురికావడం ఈ సారి అందరి వంతైంది. ఆ అకౌంట్ లో కేవలం 17 అంటే అక్షరాలా పదిహేడు రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇది ఆకతాయి పనా, లేక మతిస్థిమితం కోల్పోయి అలా చేసి ఉండొచ్చా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు తాజాగా.

నేడు బ్యాంక్ కు అధికారికంగా చెక్ పంపనున్న దేవస్థానం
అయితే చెక్ హోల్డర్ వివరాలను అధికారికంగా కనుక్కునేందుకు చెక్ ను నేడు బ్యాంక్ కు అధికారికంగా పంపి పూర్తి వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు టెంపుల్ అధికారులు. దాన్ని బట్టి ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని అతణ్ని సంప్రదించి ఆకతాయి పనైతే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఆలయ అధికారులు ఉన్నట్టు సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget