Maoist Chalapati: నిబద్దత గల ఉద్యమకారుడు చలపతి, ఆయన ఆశయాలను కొనసాగిస్తాం - సెంట్రల్ రీజనల్ బ్యూరో లేఖ విడుదల
మూడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం, తూర్పు కనుమల్లో విప్లవోద్యమ నిర్మాణంలో భామగమైన సాహసిక యోదుడు, వీర గెరిల్లా నాయకుడు చలపతి అంటు సీపీఐ మావోయిస్టు పార్టీప్రచారకమిటి సెంట్రల్ రీజనల్ బ్యూరో పేర్కోంది.

Chhattisgarh Encounter | ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో ఇటివల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మరణించిన విషయం విధితమే. ఆయన అంత్యక్రియలు సైతం పలాస మండలం బొడ్డపాడులో నిర్వహించారు. ఆయన 32 ఏళ్ల పాటు మావో పార్టీకి అందించిన సేవలతో ఆయన కుటుంబం కోసం సెంట్రల్ రీజనల్ బ్యూరో ఎనిమిది పేజీలు లేఖ విడుదల చేసింది. ఉద్దానం ప్రాంతంలో సోషల్ మీడియాలో హల్చల్ అయింది.
ఒడిశా, ఛత్తీస్ గఢ్ పోలీసులతో పాటు 1500 కేంద్ర బలగాలను ఎదురొడ్డి వీరోచితంగా పోరాడి అమరుడైన చలపతి అలియాస్ జైరామ్ తో పాటు మరో 16 మంది కామ్రెడ్స్ ప్రాణాలు కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అసలు పేరు రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో, ఒడిశా సరిహద్దుల్లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన తరువాత జైరామ్ కేంద్ర కమిటి స్థాయికి ఎదిగిన చలపతి సుదీర్ఘకాలం ఉద్యమాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. ఆయన పనిచేసిన కాలంలోనే శ్రీకాకుళం జిల్లా ప్లీనరీ సమయంలో కొప్పరడంగి వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో అప్పటి జిల్లా కార్యదర్శి రాజన్నతో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఆ నాటి ఎన్ కౌంటర్లో పోలీసు కాల్పుల నుంచి బయటపడ్డ చలపతి ఒడిశా -ఆంధ్ర సరిహద్దుతో పాటు దండకారణ్యంలో తమదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
ఆయన నాయకత్వం చేపట్టిన ఉద్యమాలు, సాధించిన విజయాలను లేఖలో ప్రశంసించారు. శ్రీకాకుళం ఉద్యమ చరిత్ర ప్రభావంతో విప్లవ రాజకీయాల కార్యకలాపాలలో క్రియశీలంగా పనిచేసిన చలపతి పూర్తికాలం విప్లవ కారునిగా పనిచేయడానికి నిర్ణయించుకుని ఉద్యోగాన్ని వదులుకున్నారని గుర్తుచేశారు. 1989 నాటికి సుధ పేరుతో మందస, సోంపేట మండలాల్లోని గ్రామీణ ప్రాంతంలో కేంద్ర ఆర్గనైజర్గా పనిచేశాడు. 1990లో దళాలు ఏర్పడిన తరువాత చలపతి ఉద్దానం దళ కమాండర్ బాధ్యతలు నిర్వహించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. 1990-91 నుంచి ఉద్దానం ప్రాంతంలో మత్యకారుల సమస్యలు, రైతాంగాం సమస్యలు, వెనుకబడిన ప్రాంతానికుండే ప్రత్యేక సమస్యలు పరిష్కరించడంలో క్రియశీలక పాత్ర పోషించారు. ఇలా సాధించిన విజయాలపై 8 పేజీల లేఖను విడుదల చేశారు.
అలాగే ఛత్తీస్ గఢ్‌లో పోరాటం 15-20 కి.మీ పరిధిలో జరిగింది. ఈ దాడిలో 4 డ్రోన్ కెమెరాలు, 5 కి.మీ పరిధిలో డాగ్ స్క్వాడ్ వినియోగించారని ఖచ్చితమైన సమాచారంతో నిర్దిష్ట పథకంతో కేంద్రం, రెండు రాష్ట్రాల ఐజీ, ఎస్పీల పర్యవేక్షణలో హింసాకాండ జరిగిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న విధ్వంసకర కగార్ ఆపరేషన్లో ఇది భాగమేనని ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీన్ హంట్, సమాధాన్ ప్రహార్ దాడులను ఓడించిన భారత విప్లవోద్యమం కగార్ దాడులను కూడా వీరోచితంగా ఎదుర్కుంటోందన్నారు. దోపిడీరాజ్యాన్ని మట్టుబెట్టి ప్రజారాజ్యాన్ని స్థాపిస్తుంది.
కామ్రేడ్ చలపతికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రతాపరెడ్డి. పని చేసిన క్రమంలో ఉద్దానంలోసుధా, అప్పారావు, తూర్పుకనుమలంతటా (ఏఒబి జోన్లో) రవి, చలపతి, ఒడిశాలో జైరామ్ పేర్లతో పనిచేసి స్థానిక ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మత్యంకొత్తపల్లి (పైపల్లె)గ్రామంలో లక్ష్మమ్మ, రామనుబ్బారెడ్డి దంపతులకు ప్రతాపరెడ్డి జన్మించాడు. చిత్తూరులో బీస్సీ చదివిన ఆయన మొదట మదనపల్లిలోనిసెరీకల్చర్లో ఉద్యోగిగా చేరాడు. 1988లో పట్టు పరిశ్రమ శాఖలో పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్యమ చరిత్ర ప్రభావంతో విప్లవ బాట పట్టి, క్రియాశీలంగా పనిచేశాడు చలపతి. అందుకోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడని ప్రకటించారు. 1995లో జరిగిన అఖిల భారత ప్రత్యేక కాన్ఫరెన్స్ (ఏఐఎస్సీ) ఇచ్చిన మార్గదర్శకత్వంలో డీకేలో భాగంగా ఈస్ట్ డివిజన్ ఉద్యమాన్ని ఏపీ రాష్ట్ర కమిటీ సూచనలతో నడిపాడు. శ్రీకాకుళం డివిజన్ను, ఈస్ట్ డివిజన్ ను, విశాఖ పట్టణాన్ని కలిపి ఈస్ట్ రీజియన్ ఉద్యమంగా అభివృద్ధి చేశాడ. 2000లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో ఈస్ట్ రీజియన్ ప్రతినిధిగా చలపతి హాజరయ్యాడని గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర మహాసభలో ఈస్ట్ రీజియన్ ప్రాంతాన్ని ఆంధ్ర-ఒడిశా బోర్డర్ కమిటీగా (ఏవోబీ) ఏర్పాటు చేశారు. 2001లో జరిగిన ఏవోబీ స్పెషల్ జోన్ రెండో మహాసభలో చలపతి ఎస్ జెడ్సీ సభ్యుడిగా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగాడు. శత్రువుపై చేసే మెరుపు దాడుల్లో వీరోచితంగా పోరాడిన వీర గెరిల్లా యోధుడు కామ్రేడ్ చలపతి అని, ఏవోబీ జోన్లో అనేకసార్లు నిర్వహించిన మిలిటరీ శిక్షణా శిబిరాలలో కమాండర్లకు, పీఎల్ జీఏ బలగాలకు మిలటరీ శిక్షణ అందించాడని లేఖలో తెలిపారు.
పోలీసు కౌన్సిలింగ్ అంతా కపట నాటకమని, ఇది విప్లవోద్యమంపై మరోదాడి అని వివరించేవాడని తెలిపారు. తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. పోలీసు కుట్రలను బహిర్గతపరుస్తూ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయించేవాడు. నిర్దిష్ట అధ్యయనం చేస్తూ, కేడర్కు ముఖ్యమైన అంశాలపై క్లాసులు చెబుతూ తాను ఎదుగుతూ, కేడర్ను బలపరుస్తూ ఏవోబీ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కృషి చేశాడు. చలపతి ఆశయ సాధనకు పునరం కితమవుదామంటూ ప్రచారకమిటి పేరిట లేఖ విడుదలైంది.

























