IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Minister RK Roja: 13 జిల్లాలపై షార్ట్‌ఫిల్ములు తీయిస్తాం, ఎందుకంటే: మంత్రి రోజా - చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు

Visakhapatnam: మంత్రి పదవి వచ్చాక తిరుమల దర్శనం చేసుకుని తొలిసారి వైజాగ్ వచ్చానని ఈ సందర్భంగా రోజా అన్నారు.

FOLLOW US: 

పర్యాటక, క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మంత్రి ఆర్కే రోజా తొలిసారి విశాఖపట్నం వచ్చారు. విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. మంత్రి పదవి వచ్చాక తిరుమల దర్శనం చేసుకుని తొలిసారి వైజాగ్ వచ్చానని ఈ సందర్భంగా రోజా అన్నారు. గతంలో పార్టీ పెట్టిన కొత్తలో వైజాగ్ ఇంచార్జ్ గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘‘శారదా పీఠంలో స్వరూపానంద స్వామి దర్శనం చేసుకున్నా. సింహాచలం దర్శనం కూడా చేసుకుంటా. తెలుగు అమ్మాయిగా తెలుగు సంస్కృతిని ఎల్లప్పుడూ ప్రమోట్ చేయడానికి ముందుంటా’’నని అన్నారు.

‘‘వైజాగ్ అనగానే దేవుడే కాదు.. బీచ్ లూ.. పర్యాటక ప్రాంతాలు చాలా ఉంటాయి. వాటిని, శారదా పీఠాన్ని పర్యాటకంగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది వచ్చేలా పని చేస్తా. హీరోయిన్ గా అరకు లాంటి పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగా. ఇప్పడు మంత్రిగా వాటిని మరింత అభివృద్ధి చేస్తా. నా మొదటి సినిమా చామంతి షూటింగ్ అరకు లోనే జరిగింది. అలాగే క్రీడల మంత్రిగా రాష్ట్రంలోని వెనుకబడిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చి వారు పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తా. వైజాగ్ నుంచి ఏ మంత్రి ప్రాతినిథ్యం వహించకున్నా ఉమ్మడి జిల్లాల కింద పరిగణిస్తే రెండు మంత్రి పదవులు ఇచ్చారు.’’

షార్ట్ ఫిల్ములు తీయిస్తాం
‘‘రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలపై షార్ట్ ఫిల్మ్స్ తీయించి.. పర్యాటకులకు వాటి గురించి తెలిసేలా వివరాలు అందిస్తాం. పర్యాటక ప్రాంతాల్లో కాటేజీలు నిర్మిస్తాం. టెంపుల్ టూర్స్, సర్క్యూట్ టూర్లు ఏర్పాటు చేస్తాం. కేంద్రంలో ఉన్న పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో సమన్వయం చేసుకుని రాష్ట్రాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం.

విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందన
‘‘విజయవాడ ఘటన దురదృష్ట కరం. కేంద్రం దిశ చట్టాన్ని ఆమోదించి ఉంటే అత్యాచారం చేసిన వాళ్ళకి వెంటనే ఉరేసే అవకాశం ఉండేది. అమ్మాయిలు మాయమాటలు విని ట్రాప్ లో పడొద్దు. ఇలాంటి ఘటనలను రాజకీయ పార్టీలు రాజకీయం చెయ్యాలని చూడడం సరికాదు. చంద్రబాబు దగ్గర కార్పొరేటర్ వేధింపుల  వల్ల విజయవాడలో ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడితే కనీసం ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించని చంద్రబాబు అసలు ఉన్మాది. కాల్ మనీ వ్యవహారంలో సీడీల ప్రూఫ్‌లను బయట పెడితే తనను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? ఎమ్మెల్యే చింతమనేని వనజాక్షిని కొట్టినప్పుడు చంద్రబాబు ఏమయ్యాడు? ఆడ పిల్లల పుట్టుకపై కామెంట్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు. కరోనా టైంలో కూడా రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబే. ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు ఏ ప్రమాదం ఎదురైనా వెంటనే దిశ యాప్ వాడండి. ఎవ్వరినీ గుడ్డిగా ప్రేమించి మోసపోకండి. తల్లి తండ్రులతో ఏ విషయం గురించైనా ఓపెన్ గా మాట్లాడండి.

Published at : 23 Apr 2022 03:18 PM (IST) Tags: Minister RK Roja visakha sarada peetham Roja News vijayawada Gang rape incident AP Tourism minister

సంబంధిత కథనాలు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్‌

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా  వైసీపీ స్కెచ్‌

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

New Trend In Vizag: మేడ మీద ఫుట్ బాల్ -వైజాగ్‌లో న్యూ ట్రెండ్

New Trend In Vizag: మేడ మీద ఫుట్ బాల్ -వైజాగ్‌లో న్యూ ట్రెండ్

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!