అన్వేషించండి

Milan-2024: విశాఖ తీరంలో గర్జించిన యుద్ధనౌకలు, బాంబుల వర్షం కురిపించిన భారత సేనలు; ఘనంగా మిలాన్ 2024 వేడుకలు

Vizag News: విశాఖ తీరంలో మిలాన్-2024 వేడుకలు ఘనంగా సాగుతున్నాయి, నేడు ఆర్కేబీచ్ లో సిటీ పరేడ్ నిర్వహించనున్నారు

Milan 2024 Celebrations: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్‌(Milan2024)2024 విన్యాసాలు విశాఖ(Visaka)లో ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన సిటీ పరేడ్‌ నేడు ఆర్కే బీచ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి  జగదీప్‌ ధన్‌కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు. భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikranth)ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

మిలాన్ మెరుపులు
భారత నావికాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఫ్లాగ్‌షిప్ నావికా విన్యాసమైన మిలాన్(Milan) -2024 12వ ఎడిషన్‌ వేడకులు అట్టహాసంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా నేడు ఆర్కేబీచ్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు.  ప్రపంచ దేశాలకు చెందిన నౌకాదళ విన్యాసాలు తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. 9 రోజుల పాటు జరగనున్న వేడుకల్లో గ‌గ‌న త‌లంలో ఫైట‌ర్‌ జెట్‌లు, హెలికాఫ్ట‌ర్ల విన్యాసాల‌తో ఆక‌ట్టుకోనున్నాయి. అమెరికా(US), ర‌ష్యా, ఇరాన్, జ‌ర్మనీ, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, ద‌క్షిణ కొరియా, ఇండోనేషియా, మ‌లేషియా ఇలా యాభై దేశాల‌కు చెందిన నౌకాద‌ళాలు మిలాన్‌లో పాల్గొన‌నున్నాయి.
మిలాన్ విన్యాసాల కోసం చేప‌ట్టిన రిహార్సల్స్  విశాఖ(Visaka) నగరవాసులను  ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్నాయి.  భారీ యుద్ద నౌక‌లు, స్పీడ్ బోట్‌లు, ఫైట‌ర్ జెట్స్, పారాచూట్‌ల‌తో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు న‌గ‌ర వాసుల‌ను ఆక‌ర్షించాయి. నేడు మొత్తం కార్యక్రమానికే తలమానికంగా నిలవనున్న  సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన నౌకాదళ సిబ్బంది తమ దేశీయ జాతీయ జెండాలతో వరుస క్రమంలో కవాతు చేయనున్నారు.  ఈ కార్యక్రమం తిలకించేందుకు  భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు. 

విశాఖ ప్రత్యేకం
2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలను ఆక‌ర్షంచిన‌ విశాఖ మహా నగరం.. మ‌రోసారి ప్రతిష్టాత్మక మిలాన్‌-2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చింది. నిజానికి, మిలాన్‌-2024 విన్యాసాలను 'కమరడెరీ(స్నేహం)-కొహెషన్‌ (ఐక్యత)-కొలాబరేషన్‌(సహకారం)' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. విశాఖ సాగ‌ర తీరంలో మొత్తంగా మిలాన్ విన్యాసాలు రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. హార్బ‌ర్ ఫేజ్‌లో భాగంగా ఈ నెల 23 వ‌ర‌కూ వివిధ దేశాల మ‌ధ్య సాంస్కృతిక భాగ‌స్వామ్య ప్రోత్సహించ‌డానికి సిటీ ప‌రెడ్, ఎగ్జిబిష‌న్ కార్యక్రమాలు జ‌రగనున్నాయి.  సీ ఫేజ్‌లో భాగంగా 24 నుంచి 27 వ‌ర‌కూ భారీ విన్యాసాలు, అధునాత‌న ర‌క్షణ చ‌ర్యలు, యాండీ స‌బ్ మెరేన్ వార్ ఫెయిర్ నిర్వహిస్తారు. ఐఎంఎస్ విక్రాంత్‌, ఐఎంఎస్ విక్రమాదిత్య స‌హా భార‌త నౌకాధ‌ళానికి చెందిన 20 యుద్ధనౌక‌లు, వివిధ నౌకాదళాల‌కు చెందిన యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. 

తొలిసారి విక్రాంత్ రాక
భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చిన తర్వాత తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్‌ విధులు నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న విక్రాంత్‌ ప్రస్తుతం తొలిసారిగా విశాఖకు చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్‌ని బెర్తింగ్‌ చేసేందుకు అవసరమైన బెర్త్‌ ఇక్కడ లేదు. అయితే విశాఖ వేదికగా మిలాన్‌ –2024 విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖకు వచ్చిన విక్రాంత్‌ను విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌లో బెర్తింగ్‌ చేశారు. మరోవైపు.. పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న మరో విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య రెండు రోజుల క్రితం విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ని గంగవరం అదానీ పోర్టులో లంగరు వేశారు. నేడు జరిగే సిటీ పరేడ్, 23 నుంచి 27వ తేదీ వరకూ జరిగే మిలాన్‌ సీ ఫేజ్‌ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మిలాన్‌లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పరేడ్‌ సాగనుంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలతో ఆర్‌కే బీచ్‌లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget