అన్వేషించండి

Srikakulam: సిక్కోలు అధికార యంత్రాంగంలో కొత్త జోష్‌- పాత వాసన పోవడంతో జిల్లా ప్రగతి పట్టాలెక్కాలని ప్రజల ఆకాంక్ష!

Srikakulam News: సిక్కోలులో అధికార యంత్రాంగం మొత్తం మారిపోయింది. ప్రభుత్వం మారడంతో తమ మార్కు చూపేందుకు అచ్చెన్న, రామ్మోహన్ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు.

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని కీలక శాఖలలో అధికారులు మారిపోయారు. కొత్త యంత్రాంగం జిల్లాలో కొలువైంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలు కొద్ది నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల్లో కొత్త అధికారులు వచ్చారు. గత ప్రభుత్వం ఇక్కడ కీలకపోస్టుల్లో ఉండే పలువురు అధికారులు బదిలీ అయ్యారు. వారిస్థానంలో కొత్తవారు వచ్చారు. దీంతో జిల్లాలో అన్నీ కొత్త ముఖాలేకనిపిస్తున్నాయి. 

ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే అన్నిశాఖల్లో బదిలీలు జరిగాయి. తాజా బదిలీల్లో ఇక్కడ ఉండేవారు ఇతర జిల్లాలకు వెళ్లగా ఆయా ప్రాంతాల నుంచి కొత్తవారు ఇక్కడకి వచ్చి విధులలో చేరారు. సాధారణంగా అధికారులు ఏప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు. ప్రభుత్వాలు మారిన వెంటనే అధికారుల బదిలీలు చేపట్టడం, కోరుకున్నవారిని నియమించుకోవడం పరిపాటిగా వస్తుంది. 

రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బదిలీలు జిల్లాలో జరిగాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తొలి సమావేశంలో ప్రజలకి సుపరిపాలన అందజేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించి అంతా సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే వారికి తమదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. తీరు మార్చుకోవాలని తేల్చిచెప్పారు. 

ప్రభుత్వం బదిలీలకి అవకాశం కల్పించడంతో సుదీర్ఘకాలం జిల్లాలో పని చేసిన అధికారులు, ఉద్యోగులకి స్థాన చలనం తప్పలేదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలకి కొత్త అధికారులువచ్చారు. జిల్లా పరిషత్ సిఇఓగా శ్రీధర్ రాజా, డిప్యూటీ సిఇఓగా సత్యన్నారాయణ బాధ్యతలు చేపట్టారు. పిఆర్‌ఎస్‌గా నిషాంత్‌ హుస్సేన్, డిపిఓగా భారతీ సౌజన్యను నియమించారు. రవాణాశాఖ డిటిసిగా విజయసారథి విధుల్లో చేరారు. డిఎఫ్‌గా సంజయ్ జాయిన్ అయ్యారు. జిల్లా గనుల శాఖ అధికారిగా సి. మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం ఆర్డిఓగా సాయిప్రత్యూష నియమితులయ్యారు. 

జిల్లాలోని అనేక మండలాలలో ఇటీవలే తహశీల్దార్ల బదిలీలు పూర్తి అయ్యాయి. తాజాగా ఎంపిడిఓలు బదిలీ అయ్యారు. అరసవల్లి దేవస్థానం ఈఓగా వై.భద్రాజీ నియమితులయ్యారు. డ్వామా పి.డిగా సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రిజిస్ట్రార్‌గా కృష్ణకుమారి బాధ్యతలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్‌లు కూడా బదిలీ అయ్యారు. పోలీసు శాఖలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐల బదిలీలు ఇప్పటికే జరిగిపోవడంతో కొత్త వాళ్లు విధుల్లో చేరారు. 

ఆయా శాఖల అధికారులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని ప్రారంభించారు. తమ శాఖల్లో తాజా పరిస్థితులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికార యంత్రాంగం పూర్తిగా మారిపోయిన వేళ  పాలన గాడిలో పడుతుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశపడుతున్నారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా అధికారులు అంతా పనిచేయాలని వారంతా కోరుకుంటున్నారు. ప్రభుత్వం మారిన వేళ ప్రాధాన్యతలు మారిపోయాయి. వాటిని గుర్తెరిగి అధికారులు జిల్లా ప్రగతి కోసం పనిచేయాలని వివిధ రంగాల ప్రముఖులు సూచిస్తున్నారు. 

నగర పాలక సంస్థలో కొత్త టీం 
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకి కొత్తటీం వచ్చింది. కమిషనర్‌గా పి.వి.వి.డి ప్రసాదరావు, ఎంహెచిగా డా. సుధీర్ కుమార్  ఇప్పటికే విధుల్లో చేరి వారి మార్క్ కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం ఈఈగా దక్షిణామూర్తి, డిఇగా శ్రీహరి నియమితులయ్యారు. ఏసిపిగా ఎస్.వెంకటేశ్వరరావు బదిలీపై వచ్చారు. ఇలా కీలక విభాగాలకి కూడా అధికారులు కొత్తవారు వచ్చారు. శ్రీకాకుళం నగర అభివృద్దిపై వీరంతా దృష్టి సారించి ఈ ప్రభుత్వంలో నిధులు రాబట్టుకుని ఆశించిన ప్రగతిదిశగా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget