INS Sahyadri And INS Kolkata: జకర్తా చేరుకున్న INS సహ్యాద్రి, INS కోల్‌కతా- భారత నౌకలకు ఇండోనేషియా ఘన స్వాగతం
భారత్‌కు చెందిన నేవల్ షిప్‌లు, INS సహ్యాద్రి, INS కోల్‌కతా జూలై17న జకార్తా చేరుకున్నాయి. ఆగ్నేయ భారత దేశం రక్షణలో కీలకంగా ఉన్న ఈ నౌకలకు ఇండోనేషియా నౌకాదళం ఘనస్వాగతం పలికింది.
భారత్‌కు చెందిన నేవల్ షిప్‌లు, INS సహ్యాద్రి, INS కోల్‌కతా జూలై17న జకార్తా చేరుకున్నాయి. ఆగ్నేయ భారత దేశం రక్షణలో కీలకంగా ఉన్న ఈ నౌకలకు ఇండోనేషియా నౌకాదళం ఘనస్వాగతం పలికింది.
పోర్ట్ కాల్ సమయంలో భారత్ ఇండోనేషియా నౌకాదళాలు విసృత అంశాలపై చర్చించనున్నారు. పరస్పర సహకారం, అవగాహన, నేవీల బలోపేతం లక్ష్యంగా పనిచేయడంపై సమావేశం జరుగనుంది. ప్రొఫెషనల్ ఇంటరాక్షన్‌లు, ఉమ్మడి యోగా సెషన్‌లు, స్పోర్ట్స్ ఫిక్చర్‌లు, క్రాస్-డెక్ సందర్శనలలో భారత, ఇండోనేషియా నౌకాదళ సిబ్బంది పాల్గొంటారు. కార్యాచరణ సమావేశం పూర్తయిన తర్వాత, భారత్‌కు చెందిన రెండు నౌకలు INS సహ్యాద్రి, INS కోల్‌కతా ఇండోనేషియా నావికాదళంతో సముద్ర భాగస్వామ్య ఎక్స్‌ర్‌సైజ్(MPX)లో పాల్గొంటాయి. రెండు నౌకాదళాల మధ్య ఇప్పటికే ఉన్న అధిక స్థాయి ఇంటర్ ఆపరేబిలిటీని మరింతగా పెంచేలా మారిటైం పార్టనర్షిప్ ఎక్సర్‌సైజ్ పని చేయనుంది. .
INS సహ్యాద్రి అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లతో స్వదేశీంగా నిర్మించారు. ఇది ప్రాజెక్ట్-17 క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. గాలి, ఉపరితలం, ఉప-ఉపరితల ప్రమాదాలను గుర్తించి, ఫైట్ చేస్తుంది. ఈ నౌక విశాఖపట్నం కేంద్రంగా ఉన్న భారత నావికాదళానికి చెందిన తూర్పు నౌకాదళంలో భాగం.
మన నౌకల గురించి మీకు తెలుసా?
INS సహ్యాద్రి 468 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పు. ఇది 6,800 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు Pielstick 16 PA6 STC డీజిల్ ఇంజిన్‌లు, జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసిన రెండు LM 2500 గ్యాస్ టర్బైన్‌లు, రెండు షాఫ్ట్‌లు కలిపి డీజిల్ లేదా గ్యాస్ అమరికలో ఉంటాయి. ఇది 32 నాట్ల ఉపరితల వేగాన్ని కలిగి ఉంది. శివాలిక్-క్లాస్ ఫ్రిగేట్ షిప్‌లో బ్రహ్మోస్ యాంటీ-షిప్ క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు, బరాక్-1 క్షిపణులు ష్టిల్-1 3S90M క్షిపణిని అమర్చవచ్చు. ఇది రెండు HAL ధృవ్ హెలికాప్టర్లు లేదా అమెరికన్ తయారు చేసిన సికోర్స్కీ SH-3 సీ కింగ్ కాప్టర్లను కూడా హోస్ట్ చేయగలదు.
INS సహ్యాద్రి, తూర్పు నౌకాదళంలోని ఇతర నౌకలతో పాటు యునైటెడ్ స్టేట్స్, జపాన్‌తో పాటు మలబార్-2017 వంటి మల్టీడైమన్సన్ ఎక్స్‌ర్‌సైజ్‌లలో పాల్గొంది.
INS సహ్యాద్రి RIPMAC-2014, 2018 మిలన్ సముద్ర విన్యాసాల్లో కూడా పాల్గొంది. ఇతర దేశాల నౌకాదళాలతో SIMBEX-17, INDRA-17 వంటి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామాలను కూడా చేపట్టింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
INS కోల్‌కతా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఇండియన్ నేవీలో మరో అత్యంత ప్రభావిత నౌక. 164 మీటర్ల పొడవు, 7400 టన్నుల బరువు ఉంటుంది. ఆత్మ నిర్బర్ భారత్ కింద మజ్గాన్ డాక్ షిప్ యార్డులో తయారైంది. ఇందులో సూపర్ రాపిడ్ గన్ మౌంట్ ఉంటుంది. దీని సాయంతో ఎయిర్ క్రాఫ్ట్, షిప్‌లపై సులభంగా దాడి చేయొచ్చు. అంతే కాకుండా ఈ షిప్ నుంచి సూపర్ సోనిక్ మిసైళ్లను లాంచ్ చేయొచ్చు. ఈ రెండు నౌకలు ముంబైలోని మజాగాన్ డాక్ లిమిటెడ్‌లో నిర్మించబడ్డాయి.