By: ABP Desam | Updated at : 09 May 2022 06:33 AM (IST)
తుపాను గమనాన్ని తెలియజేస్తున్న మ్యాప్
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను.. పదో తేదీ నాటికి తీ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం సాయంత్రానికి ఇది ఉత్తరకోస్తాంధ్ర, ఒడిశా తీరానికి సమీపానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అందుకే దీని ప్రభావం ఉత్తర కోస్తాపై ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను కారణంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. వర్షాల కారణంగా జీడి,మామిడి, పనస పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట నేల రాలింది. ఇది రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది.
SCS ‘Asani’ over Southeast and adjoining Westcentral Bay of Bengal, near lati 13.0°N and long 87.5°E, about 570 km west-northwest of Port https://t.co/kPvyqOuD7u move northwestwards till 10th May night and reach Westcentral and adjoining Northwest BoB off North AP & Odisha coast pic.twitter.com/gecVctA5M1
— India Meteorological Department (@Indiametdept) May 8, 2022
అసని తుపాను కారణంగా 10, 11 తేదీల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని కూడా ఐఎండీ పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచిస్తోంది. 10వ తేదీకి కాకినాడ తీరానికి సమీపానికి రానున్న అసని తుపాను ఎక్కడా తీరం దాటదని... సముద్రంలోనే బలహీన పడనుందని ఐఎండీ వెల్లడించింది.
నిన్న సాయంత్ర గుంటూరులో ఈదురు గాలులు దుమారం రేపాయి. హోర్టింగ్స్, ఫ్లెక్సీలు తెగిపడ్డాయి. అవి విద్యుత్ తీగలపై పడటంతో షాట్ సర్క్యూట్ అయింది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తుపాను కారణంగా ఏపీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జిల్లాలో డివిజన్, మండల స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది (రెవెన్యూ, EPDCL, RWS, R&B, ఫైర్, పోలీస్, ఫిషరీస్, ఆల్ GSWS సిబ్బంది, పంచాయత్ రాజ్. DPO & పంచాయితీ సెక్రటరీలు) 08942-240557 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తదుపరి సూచనలు అందించే వరకు కంట్రోల్ రూమ్ 24x7 పని చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తీరప్రాంత గ్రామాలను అప్రమత్తం చేయాలని తుఫాను సమయంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. సిబ్బంది, అధికారులు అందరూ జిల్లా ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు. అధికారులకు, సిబ్బందికి సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించారు.
Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్