News
News
X

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సమ్మిట్‌లో రెండో రోజు రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులు- 260 ఒప్పందాలపై సంతకాలు

పెట్టుబడులను ఆకర్షించిన రంగాలలో ఇంధన శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఐటీ శాఖ, పర్యాటక శాఖ, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ ఉన్నాయి.

FOLLOW US: 
Share:

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ రెండో రోజున భారీగానే ఎంవోయూలు కుదిరాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. మొదటి రోజు 13 కంటే ఎక్కువ రంగాల్లో ఎంవోయూలు కుదిరాయి. రెంో రోజు కూడా ప్రభుత్వం 1.17 లక్షల కోట్ల రూపాయల విలువైన 260 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. రెండు రోజుల్లో రూ. 13,05,663 లక్షల కోట్ల విలువైన మొత్తం 352 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది, 

వ్యవసాయ శాఖ 1160 కోట్ల విలువైన 15 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. పశుసంవర్ధక శాఖ 1020 కోట్ల విలువైన 8 ఎంవోయూలపై కుదుర్చుకుంది. ఈ 23 ఒప్పందాలు రాష్ట్రంలో 3750 మందికి ఉపాధిని కల్పించే ఛాన్న్ ఉందని ప్రభుత్‌వం చెబుతోంది. రాష్ట్రంలో 30,000 మందికి పైగా ఉపాధిని కల్పించే 22,096 కోట్ల విలువైన 117 అవగాహన ఒప్పందాలు పర్యాటక రంగంలో జరిగాయి. ఇంధన శాఖ 8,84,823 కోట్ల విలువైన 40 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇది దాదాపు 2 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టిస్తుందని అంచనా ఉంది. 

పెట్టుబడులను ఆకర్షించిన రంగాలలో ఇంధన శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఐటీ శాఖ, పర్యాటక శాఖ, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారుల్లో రిలయన్స్ 1,00,000 మందికి ఉపాధిని కల్పించే 5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. 14.3 కోట్ల పెట్టుబడులతో 1500 మందికి ఉపాధి కల్పించే అవగాహన ఒప్పందంపై HPCL సంతకం చేసింది. HCL టెక్నాలజీస్ 22 కోట్ల రూపాయల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ 20 కోట్ల రూపాయల పెట్టుబడితో 300 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

మొదటి రోజున AP ప్రభుత్వం 11,87,756 లక్షల కోట్ల రూపాయల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఇందులో ఇంధన శాఖ 8.25 లక్షల కోట్ల పెట్టుబడితో 35 పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించింది. దీని వల్ల 1.33 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా వేస్తోంది. 3.20 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను ఆకర్షించిన పరిశ్రమలు, వాణిజ్యం శాఖ. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధిని సృష్టించవచ్చని భావిస్తోంది. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష్ట్రంలోని 13,400 మందికి ఉపాధి కల్పించేందుకు 8,718 కోట్ల పెట్టుబడితో పర్యాటక శాఖ 10 ప్రతిపాదనలపై సంతకాలు చేసింది. 

ప్రధాన పెట్టుబడిదారుల్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2,35,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఉద్దశంతో 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని వల్ల 77,000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించింది. JSW గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పిస్తామంటోంది. ABC లిమిటెడ్ 1.20 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక ఎంవోయూపైై సంతకం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధిని కల్పిస్తామంటోంది. అరబిందో గ్రూప్ 10,365 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి లభించనుందని అంచనా.  అదానీ గ్రీన్ ఎనర్జీ 21,820 కోట్ల రూపాయల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించేందుకు 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 9,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 2,850 మందికి ఉపాధి కల్పిస్తామంటోంది. జిందాల్ స్టీల్ 2,500 మందికి ఉపాధి కల్పించే ,500 కోట్ల పెట్టుబడితో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Published at : 04 Mar 2023 12:59 PM (IST) Tags: AP News Visakha News CM Jagan Global investors summit 2023 Global investors summit First Day Global investors Summit in Visakha AP Updates Global investors summit Second Day

సంబంధిత కథనాలు

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

జగన్ ప్రభుత్వం పడిపోతే మొదట తగిలే దెబ్బ ఆడవారికే - మంత్రి ధర్మాన

జగన్ ప్రభుత్వం పడిపోతే మొదట తగిలే దెబ్బ ఆడవారికే - మంత్రి ధర్మాన

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు