అన్వేషించండి

గంగవరం పోర్టు యాజమాన్యంతో చర్చలు సఫలం- నేటి నుంచి విధుల్లో కార్మికులు

గంగవరం పోర్టు కార్మికులకు...యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయ్. నేటి నుంచి విధుల్లోకి చేరడానికి కార్మికులు అంగీకారం తెలిపారు.

గంగవరం పోర్టు కార్మికులకు...యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయ్. నేటి నుంచి విధుల్లోకి చేరడానికి కార్మికులు అంగీకారం తెలిపారు. కార్మికులకు ప్రతి యేటా ఇచ్చే  ఇంక్రిమెంట్ 5.26శాతంతో పాటు అదనంగా 15వందలు ఇవ్వడానికి పోర్టు యాజమాన్యం అంగీకరించింది. పది వేల బోనస్ తో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే...మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. 

స్పెన్షన్ కు గురయిన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఒప్పుకుంది. 509 మంది కార్మికులకు...సమ్మెకాలంలోనే 22 రోజులవేతనం చెల్లించడానికి కూడా పోర్టు యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  25లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపు, నాలుగు కార్పొరేట్ ఆస్పత్రులతో వైద్య సేవలు కల్పించనుంది పోర్టు యాజమాన్యం. సమ్మె సమయంలో 22రోజులకు వేతనం చెల్లించడమే కాకుండా కార్మికులకు మేజర్ హాస్పిటల్లో మెడికల్ ఫెసిలిటీ కల్పించనుంది. 

గత జూన్‌ నుంచే గంగవరం పోర్టు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. విశాఖపట్నంలో తమ సహచరులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ... గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. సహచరులను సస్పెండ్‌ చేసినందుకు యాజమాన్యానికి వ్యతిరేకంగా... సీఐటీయూ, గంగవరం పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నాలు చేసింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన కార్మికులు...గత నెల 17న గో బ్యాక్‌ అదానీ.. అంటూ సమర శంఖం పూరించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలతో కలిసి చలో అదానీ గంగవరం పోర్టు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఉదయం పెదగంట్యాడలోని దీక్షా శిబిరం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, అఖిలపక్ష నాయకులు ర్యాలీగా పోర్టు గేటుకు బయలుదేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ ఇనుపకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని... కొందరికి గాయాలయ్యాయి. ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్‌ కార్మికుల తరఫున పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిపి 5 రోజుల గడువు కోరడంతో...అదే రోజు సాయంత్రానికి ఆందోళనకారులు శాంతించారు. 

పోర్టు నిర్మాణానికి  స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు భూములు  ఇచ్చారు. భూములు ఇచ్చిన కుటుంబాలకు  పోర్టులో ఉద్యోగం కల్పించారు. పోర్టులో  ఉద్యోగం చేస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయకపోవడంపై కార్మికులు ఆగ్రహించారు. తమకు కనీసంగా  నెలకు రూ. 36,500 చెల్లించాలని  కార్మికులు డిమాండ్  చేశారు. వివిధ రూపాల్లో కార్మికులు ఆందోళనలు చేసిన తర్వాత...పోర్టు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల విధించిన డిమాండ్లపై ఇవాళ మరోసారి చర్చలు జరిగాయ్. గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. పది వేల బోనస్ తో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే...మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్ట పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. సస్పెన్షన్ కు గురయిన ఐదుగురు ఉద్యోగులను...తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఒప్పుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్పామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్పామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్పామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్పామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Embed widget