అన్వేషించండి

మా గంగమ్మను తీసుకొని మమ్మల్ని విసిరేస్తారా- గంగవరం పోర్టు కార్మికుల ఆవేదన

నిత్యవసరాలు విపరీతంగా పెరిగిపోయాయని... ఇలాంటి పరిస్థితుల్లో పోర్టు వారు ఇచ్చే తొమ్మిది పదివేల జీతం ఎందుకూ సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు గంగవరం పోర్టు కార్మికులు.

మా సముద్రాన్ని తీసుకొని మా ఉపాధి కొట్టేసి ఇప్పుడు మా కడుపు మాడుస్తున్నారని గంగవరం పోర్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చే టైంలో చాలా చెప్పారని అవేవీ ఇప్పుడు అమలు కావడం లేదంటున్నారు నిర్వాసితులు. 45 రోజులుగా ఆందోళన చేస్తున్న గంగవరం పోర్టు కార్మికులు ఇవాళ పోర్టు ముట్టడికి యత్నించారు. 

గంగవరం పోర్టు ముట్టడి కార్మికులు యత్నిస్తున్న విషయాన్ని ముందుగానే తెలియడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన గేటుకు కాస్త దూరంలో మరో గేటు ఏర్పాటు చేశారు. దానికి సుమారు 100మీటర్ల దూరంలో ముళ్ల కంచెలను కూడా ఏర్పాటు చేశారు. కార్మికులను అటువైపు రానీయ కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కార్మికుల ఆగ్రహం ముందు ఆవేవీ పని చేయలేదు. పార్టీలకు అతీతంగా, పోర్టు కార్మికులు తమ కుటుంబాలతో పోర్టు వద్దరకు చేరుకున్నారు. పోర్టు బంద్‌ కార్యక్రమంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు కూడా పాల్గొన్నారు. వాళ్లకు అఖిలపక్షం నేతలు సపోర్ట్ చేశారు. 

ఇలా అన్ని వర్గాల ప్రజలు, కార్మికుల ముట్టడి గంగవరం పోర్టు వద్ద ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అటు నుంచి పోలీసులు ఇటు నుంచి కార్మికులు రెండు వర్గాల మధ్య హైటెన్షన్ పరిస్థితి నెలకొంది. కంచెలను దాటుకొని గేటు వద్దకు చేరుకోవడానికి కార్మికుల యత్నించారు. అలా చాలా మంది కార్మికులు గాయపడ్డారు. రక్తాలు కారుతున్నా వారు లెక్క చేయలేదు. 

కార్మికుల ప్రతిఘటనతో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పది మంది సిబ్బందికి తలకు గాయాలు అయ్యాయి. సీఐ కాలిలో ముళ్ల కంచెం దిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పలువురు కార్మికులను గ్రామస్థులను, పార్టీల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

పోలీసుల తీరుపై కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ కడుపు కాలి ఆందోళన చేస్తుంటే తమ వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం నిత్యవసరాలు విపరీతంగా పెరిగిపోయాయని... ఇలాంటి పరిస్థితుల్లో పోర్టు వారు ఇచ్చే తొమ్మిది పదివేల జీతం ఎందుకూ సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ జీతాలు చూసి జనాలు చాలా చీప్‌గా చూస్తున్నారని.. పిల్లల చదువులు, వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నారు. 

తమ గంగ తల్లిని లాక్కోవడమే కాకుండా తమ పొట్టలపై కొట్టారని అన్నారు కార్మికులు. అప్పట్లో చాలా చెప్పారని అవేవీ అమలు చేయడం లేదంటున్నారు. 45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే పట్టించుకున్న వారే లేరని అంటున్నారు. అందుకే కడుపు మండి ఇప్పుడు గంగవరం ముట్టడికి వచ్చినట్టు చెబుతున్నారు. 

ఎన్ని రోజులైనా పోరాటం ఆపబోమంటున్నారు కార్మిక కుటుంబాలు, చావడానికైనా సిద్ధమని అంటున్నారు. తమకు అన్నం పెట్టే సముద్రాన్ని లాక్కున్న వ్యక్తులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలా అప్పగించామో అలానే సముద్రం ఇచ్చేయమంటున్నారు. ఉద్యోగాలు కూడా తమకు వద్దని వేటకు వెళ్లి పట్టెడన్నం తినే వాళ్లమని కానీ ఇప్పుడు ఆ పిడికెడు మెతుకులు కూడా నోటిలోకి వెళ్లడం లేదంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Embed widget